కూతురి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని కువైట్ నుంచి వచ్చి మరీ చంపేశాడు కన్నతండ్రి.

కూతురి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని కువైట్ నుంచి వచ్చి మరీ చంపేశాడు కన్నతండ్రి.

తిరిగి కువైట్‌ వెళ్లి ఆ హత్య తానే చేశానంటూ ఒక సెల్ఫీ వీడియోను విడుదల చేశాడు. పోలీసుల చేతకానితనంతోనే తాను హత్య చేయాల్సి వచ్చిందని తెలిపాడు. వివరాల్లోకి వెళితే రెండు రోజుల కిందట అన్నమయ్య జిల్లా ఓబులావారిపల్లె మండలం మంగపేటలో నిద్రిస్తున్న 59 ఏళ్ల ఆంజనేయులు దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ సమయంలో కువైట్‌ నుంచి ఓ సెల్ఫీ వీడియో వచ్చింది. ఈ హత్య చేసింది తానేనని .. హత్యకు గురైన ఆంజనేయులు బంధువు ఆంజనేయ ప్రసాద్‌ వీడియోలో తెలిపాడు.తన కూతురి పట్ల అసభ్యంగా ప్రవర్తించినందుకే హత్య చేసి కువైట్‌ వెళ్లిపోయానన్నాడు. పోలీసుల ఎదుట లొంగిపోయేందుకు కువైట్‌ నుంచి ఆంజనేయప్రసాద్‌, ఆయన భార్య మంగళవారం ఇండియాకు వచ్చారు. రెండు రోజులు అవుతున్నా ఇంతవరకు ఆంజనేయప్రసాద్‌ దంపతుల ఆచూకీ లభించకపోవడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. తమకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటామని దంపతులు హెచ్చరించడంతో పోలీసు, బంధువుల్లో ఆందోళన నెలకొన్నది.

ehatv

ehatv

Next Story