Family Suicide : అప్పు తిరుస్తారా? లేదా కూతురు సంగతి చూస్తాం!
బాసరలో(Basara) దారుణం చోటు చేసుకుంది.
బాసరలో(Basara) దారుణం చోటు చేసుకుంది. అప్పు(Debt) ఇచ్చిన వారి వేధింపులు తాళలేక ఒక కుటుంబం ఆత్మహత్యకు(suicide) ప్రయత్నించింది. తీసుకున్న అప్పు ఇస్తారా? లేకపోతే వయసులో ఉన్న మీ కూతురు సంగతి చూడమంటారా? అని అప్పు ఇచ్చిన వారు బెదిరిస్తూ వేధిస్తూ ఉండటం తో ఆ కుటుంబం గోదావరిలో(Godhavari) దూకింది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నల్కర్ రోడ్‌లో ఉంటున్న ఉప్పలించి వేణు -అనురాధలకు పాతికేళ్ల కూతురు పూర్ణిమ ఉంది. వేణు ఓ చిన్న వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించేవారు. వ్యాపార అవసరాల కోసం వీరు గంజి మార్కెట్‌లోని రోషన్, వికాస్‌ల దగ్గర సుమారు 3 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నారు. దీనికి వారు చక్రవడ్డీ వేసి అప్పును రెట్టింపు చేశారు. అప్పు తీర్చాల్సిందేనని పట్టుబట్ట సాగరు. అప్పు తీర్చక పోతే వయస్సులో ఉన్న నీ కూతురు సంగతి చూస్తామని బేదిరించడం మొదలు పెట్టారు. గత్యంతరం లేక బుధవారం బాసర దగ్గర ఉన్న గోదావరి నది లో దూకారు. ఇది గమనించిన స్థానికులు వారిని కాపాడే ప్రయత్నం చేశారు. భర్త వేణు(55) చనిపోయారు. కూతురు పూర్ణిమ గల్లంతయింది. భార్య అనురాధను మాత్రం స్థానికులు కాపాడగలిగారు. అనురాధ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.