తిరుమల తిరుపతి దేవస్థానాల‌ పేరుతో గల మరో నకిలీ వెబ్సైట్ ను టీటీడీ ఐటీ విభాగం గుర్తించింది. ఈ విష‌య‌మై వెంట‌నే తిరుమల వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

తిరుమల తిరుపతి దేవస్థానాల‌(Tirumala Tirupathi Devasthanam) పేరుతో గల మరో నకిలీ వెబ్సైట్(Fake Website) ను టీటీడీ ఐటీ విభాగం(TTD IT Wing) గుర్తించింది. ఈ విష‌య‌మై వెంట‌నే తిరుమల వన్ టౌన్ పోలీసుల(Tirumala Police)కు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేర‌కు పోలీసులు.. ఎఫ్ఐఆర్ 19/2023 యు/ఎస్, 420, 468, 471 ఐపీసీ సెక్ష‌న్‌ల కింద‌ నమోదు చేసి ఏపీ ఫోరెన్సిక్ సైబర్ సెల్(AP Forensic Cyber Cell) కు అప్పగించారు. ఈ మేరకు సైబర్ సెల్ అధికారులు నకిలీ వెబ్సైట్ పై విచారణ ప్రారంభించారు. ఇదివరకే 40 నకిలీ వెబ్సైట్లపై కేసులు నమోదు కాగా, దీంతో కలిపి కేసుల సంఖ్య 41కి చేరింది.

అధికారిక వెబ్సైట్ https://tirupatibalaji.ap.gov.in/ ఇలా ఉండగా.. చిన్న మార్పులతో కొందరు వ్యక్తులు రూపొందించిన https://tirupatibalaji-ap-gov.org/ వెబ్‌సైట్‌ను టీటీడీ గుర్తించింది. టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లో శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు, గదులు బుక్ చేసుకోవాలని కోరింది. దీంతో పాటు టీటీడీ అధికారిక మొబైల్ యాప్ TTDevasthanams ను కూడా వినియోగించవచ్చని టీటీడీ(TTD) పేర్కొంది.

Updated On 23 April 2023 12:09 AM GMT
Yagnik

Yagnik

Next Story