రాయపూడిలోని అఖిల భారత సర్వీసు అధికారుల క్వార్టర్స్ జీవోఎంఎస్ నెంబరు

"తాకట్టులో సచివాలయం" అనే శీర్షికతో ఆంధ్రజ్యోతి ప్రధాన సంచికలో వచ్చిన వార్తలో ఏ మాత్రం నిజం లేదని ప్రభుత్వం తెలిపింది. ఈ ప్రచురితమైన కథనం పూర్తిగా సత్యదూరమని తెలిపింది. రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ నుంచి ఈవిషయమై ఏపీ సీఆర్డీఏకు ఎటువంటి ప్రతిపాదనలు రాలేదని.. క‌న్సార్టియం బ్యాంకులు, హడ్కోల నుంచి ఏపీ సీఆర్డీఏ పొందిన రుణాన్ని ముఖ్యమైన మౌలిక సదుపాయాల అభివృద్ధికి వినియోగించటం జరిగింది. రాష్ట్ర సచివాలయంలోని అయిదు భవనాలు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు తాకట్టుపెట్టినట్లు వచ్చిన వార్త పూర్తిగా వాస్తవ విరుద్ధం. ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుల నుండి ఏపీ సీఆర్డీఏ ఎటువంటి రుణాన్ని పొందలేదని సంస్థ అకౌంట్స్ డైరెక్టర్ బి.శ్రీనివాసరావు నివేదించారు.

రాయపూడిలోని అఖిల భారత సర్వీసు అధికారుల క్వార్టర్స్ జీవోఎంఎస్ నెంబరు: 332, తేదీ: 15.10.2018 ప్రకారం 2,060 కోట్ల రూపాయల రుణాన్ని క‌న్సార్టియం బ్యాంకులు అయినటువంటి (యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా, బ్యాంకు ఆఫ్ బరోడా మరియు ఇండియన్ బ్యాంకులు) మంజూరు చేశాయి. ఇందులో రూ.1,955 కోట్లు మాత్రమే ఇప్పటి వరకు సీఆర్డీఏకు రిలీజ్ చేయటం జరిగింది. 2017వ సంవత్సరంలో హడ్కో రూ.1275 కోట్లను మౌలిక సదుపాయాల కొరకు రుణాన్ని మంజూరు చేసింది. అందులో రూ.1,151 కోట్లు మాత్రమే సీఆర్డీఏకు రిలీజ్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కంఫర్ట్ లెటర్ జారీ చేసింది. ఏపీ సీఆర్డీఏ సచివాలయ భవనాలను తాకట్టు పెట్టి ఎటువంటి రుణమూ పొందలేదు. ఇటువంటి నిరాధారమైన కథనాన్ని ప్రచురించటంపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది.

Updated On 4 March 2024 9:27 PM GMT
Yagnik

Yagnik

Next Story