Fake CBI Gang In Vizag : ఓ రిటైర్డ్ ఆఫీసర్‌ను బురిడీ, 85 లక్షలు మాయం చేసిన సీబీఐ నకిలీ గ్యాంగ్
అతను ఓ ప్రముక సంస్థలో చాలా ఏళ్లు పనిచేసి వాలంటరీ రిటైర్మెంట్(Voluntry Retairment) తీసుకున్నారు. తన రిటైర్మెంట్ ద్వారా వచ్చిన డబ్బుతో కొడుకు చదువు కోసం విదేశాలకు పంపించాలని అనుకున్నారు. ఇంతలోనే ఓ నకిలీ సీబీఐ గ్యాంగ్(Fake CBI Gang) ఎంటరైంది.
అతను ఓ ప్రముక సంస్థలో చాలా ఏళ్లు పనిచేసి వాలంటరీ రిటైర్మెంట్(Voluntry Retairment) తీసుకున్నారు. తన రిటైర్మెంట్ ద్వారా వచ్చిన డబ్బుతో కొడుకు చదువు కోసం విదేశాలకు పంపించాలని అనుకున్నారు. ఇంతలోనే ఓ నకిలీ సీబీఐ గ్యాంగ్(Fake CBI Gang) ఎంటరైంది. తన బ్యాంకు ఖాతాల్లో ఉన్న నగదు గురించి తెలుసుకున్న గ్యాంగ్ ఆ నగదును దోచుకోవాలని ప్లాన్ వేసింది. అనుకున్నది అనుకన్నట్లే ఆచరణలో చూపి దాదాపు 85 లక్షలు ఈ రిటైర్మెంట్ ఆఫీసర్ బ్యాంక్ నుంచి మాయం చేసింది.
పోలీసులు తెలిపిన ప్రకారం విశాఖలో(Vizag) ఈ ఘటన చోటు చేసుకుంది. వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న ఓ వ్యక్తిని సీబీఐ అధికారులమని చెప్పి బెదిరించింది. 'మీపై ఈడీ, మనీ లాండరింగ్ కేసులున్నాయని(Money laundry).. విచారణకు సహకరించకుంటే జైలుకెళ్లాల్సి వస్తుందని భయపెట్టిందీ గ్యాంగ్. తమకు తాము సీబీఐ, ఈడీ అధికారులమని చెప్తూ నకిలీ ఐడీ కార్డులు కూడా చూపించారు. అంతేకాదు ఆన్‌లైన్ విచారణ పేరుతో రెండు రోజుల పాటు విచారణ విచారణ కూడా చేపట్టింది. తనను తాను "డీసీపీ సైబర్ క్రైమ్ బాల్సింగ్ రాజ్‌పుత్" అని చెప్తూ బాధితుడికి వాట్సాప్ కాల్ చేశారు. అనేక మాదకద్రవ్యాలు మరియు మనీలాండరింగ్ కేసుల్లో తన పేరు వచ్చిందని, ఈ కేసులన్నింటికీ తన ఆధార్ లింక్ చేయబడిందని రిటైర్డ్ అధికారికి చెప్పాడు.
నకిలీ డీసీపీ తన సీనియర్‌గా నటిస్తున్న మరొక వ్యక్తికి డయల్ చేసి, రిటైర్డ్ వ్యక్తిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలా అని అడిగాడు. సీబీఐ, కస్టమ్స్, నార్కోటిక్స్ మరియు ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసర్‌లుగా నటిస్తూ రూ.85 లక్షల చెక్‌ను అకౌంట్‌లో వేయించుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంతో పాటు ఢిల్లీలో కూడా పోలీసు కేసు నమోదైంది. విచారణ పూర్తయిన తర్వాత మీ డబ్బు మీకే వస్తుందని, డబ్బు మీ ఖాతాలోనే తిరిగి మీ ఖాతాలోనే జమచేస్తామని నమ్మబలికింది. దీంతో భయపడిపోయిన అతను, తన ఖాతాలో ఉన్న నగదును చెక్కురూపంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో డిపాజిట్ చేశారు.
ఢిల్లీలోని ఉత్తమ్ నగర్‌లో హెచ్‌డీఎఫ్‌సీ ఖాతాను నిర్వహిస్తున్నరాణా గార్మెంట్స్ ఖాతాలో జమచేసుకుంది. ఆ తర్వాత దేశంలో ఉన్న 105 ఖాతాలకు నగదును పంపిచారు. తిరిగి తన డబ్బు రాకపోవడంతో లబోదిబోమంటూ పోలీసులను బాధితుడు ఆశ్రయించాడు. విశాఖ క్రైం బ్రాంచ్ ఈ కేసును టేకోవర్ చేసింది. కేసు దర్యాప్తులో ఉందని, తమకు కొన్ని ఆధారాలు లభించాయని తీర ప్రాంత పోలీసు వర్గాలు తెలిపాయి. విశాఖపట్నంలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ బ్రాంచ్ నుంచి క్రైమ్ బ్రాంచ్ అనేక పత్రాలను తీసుకుంది. ఢిల్లీలోని పోలీసులు రాణి గార్మెంట్స్ గురించి వెతగ్గా అక్కడ రాణి గార్మెంట్స్ కనపడలేదు. ఈ ఖాతా నుంచి పలు ఖాతాలకు నగదు బదిలీ అయినట్లు పోలీసులు గుర్తించి ఆ దిశగా విచారణ కొనసాగిస్తున్నారు.