ఓ వివాహేతర సంబంధం(Extra marital affair) హత్యకు(Murder) దారి తీసింది.

ఓ వివాహేతర సంబంధం(Extra marital affair) హత్యకు(Murder) దారి తీసింది. ఏపీలోని వాకాడు మండలం దుగ్గరాజపట్నం(Duggaraja Patnam) దగ్గర హత్య జరిగింది. ఈనెల 17న హత్య జరగ్గా పోలీసులు విచారించి నిందితులను అరెస్ట్ చేశారు. వాకాడు పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం గూడూరులోని శివాలయం ప్రాంతానికి చెందిన కొండా అనిత్‌కుమార్‌రెడ్డికి గూడూరులోని కనుపూరు శ్రీహరి అలియాస్ జెమిని(Gemini) అనే రౌడీషీటర్‌ భార్యతో వివాహేతర సంబంధం ఏర్పడింది.

వివాహేతర సంబంధం రౌడీషీటర్‌ శ్రీహరి అలియాస్ జెమిని దృష్టికి రావడంతో అనిత్‌రెడ్డిని మట్టుబెట్టాలని స్కెచ్ వేశాడు. ఇదే పట్టణంలోని మరో రౌడీషీటర్ బాసం నరేష్‌ అలియాస్ చిన్నా ప్రేమ్‌, కోట మండలం విశ్వనాథ అగ్రహారానికి చెందిన పేర్నాటి చందు అలియాస్ పేనాటి, చవటపాళెంకు చెందిన షేక్ కాలేషా, గూడూరు గాంధీనగర్‌కు చెందిన జావీదులతో కలిసి అనిత్‌రెడ్డిని హత్య చేసేందుకు ప్లాన్ వేశారు.

అనిత్‌రెడ్డికి మద్యం పార్టీ(Alcohol party) ఉందని నమ్మించి చిల్లకూరు దగ్గరలోని దాబాకు చేరుకున్నారు. అనిత్‌రెడ్డిని గూడూరు హైవే రోడ్డు నుంచి దాబా వరకు స్నేహితులు స్కూటీపై తీసుకొచ్చారు. అందరూ కలిసి మద్యం తాగారు. మద్యం మత్తులో ఉన్న అనిత్‌రెడ్డిని కర్రలతో కొట్టి హత్య చేశారు. ఆ తర్వాత ట్విమ్మర్‌తో వెంట్రుకలు, మీసాలు తొలగించారు. ఆపై మృతదేహాన్ని కారు డిక్కీలో పడేసి దుగ్గరాజపట్నం సమీపంలోని పొలాల్లో పడేశారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ హత్య వెనుక వివాహేతర సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ కోణంలో దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు శ్రీహరిపై గూడూరు వన్‌టౌన్ పీఎస్‌లో, రెండో ముద్దాయి షేక్‌ కాలేషాపై రూరల్‌ పీఎస్‌లో పలు కేసులు, రౌడీషీట్లు ఉన్నట్లు సీఐ వెల్లడించారు.

Eha Tv

Eha Tv

Next Story