Undavalli Arun Kumar : స్కిల్ కేసును సీబీఐకి అప్పగించండి
చంద్రబాబు కేసు సీబీఐకి అప్పగించాలని మాజీ ఎంపీ, ప్రముఖ న్యాయవాది ఉండవల్లి అరుణ్ కుమార్ హైకోర్టులో పిల్ వేశారు. ఆర్థిక విషయాలతో ముడిపడిన ఈ కేసు పలు రాష్ట్రాలతో ముడిపడి ఉండటం, ప్రముఖ వ్యక్తులు నిందితులుగా
చంద్రబాబు(Chandrababu) స్కిల్ కేసు సీబీఐ(CBI)కి అప్పగించాలని మాజీ ఎంపీ, ప్రముఖ న్యాయవాది ఉండవల్లి అరుణ్ కుమార్(Undavalli Arun Kumar) హైకోర్టు(High Court)లో పిల్ వేశారు. ఆర్థిక విషయాలతో ముడిపడిన ఈ కేసు పలు రాష్ట్రాలతో ముడిపడి ఉండటం, ప్రముఖ వ్యక్తులు నిందితులుగా ఉండటం వల్ల దర్యాప్తును కేంద్ర సంస్థతో జరిపించాలని పిటిషన్‌లో ఆయన కోరారు. 249 పేజీలలో రూ.241 కోట్ల దారి మళ్లింపు, పూర్తి నిందితుల జాబితాతో వివరాలు పిటీషన్‌లో సవివరంగా పొందు పరిచారు ఉండవల్లి అరుణ్ కుమార్. మొత్తం 44 మందిని పిటీషన్‌లో ప్రతివాదులుగా చేర్చారు.
సీమెన్స్ ఇండియా(Siemens India) గుజరాత్(Gujarat) ఎంఓయూ(MOU)లో పెట్టిన పేరు, సంతకం.. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో పెట్టిన పేరు, సంతకం వేరు వేరుగా ఉన్నాయని పిటీషన్‌లో పేర్కొన్నారు. దురుద్దేశ పూర్వకంగా కుట్ర కోణంతో చంద్రబాబు నాయుడు సహకారంతో రూ.241 కోట్ల దారి మళ్లింపు జరిగిందని పిటీషన్‌లో వెల్లడించారు. ఒక్క ఎంఓయూ తప్ప రిమాండ్ ఆర్డర్స్(RemandOrders), రిమాండ్ రిపోర్ట్స్(Remand Reports)తో సహ కేసుకు సంబందించిన అన్నీ డాక్యుమెంట్స్ పిటీషన్‌కు జత చేశారు. చంద్రబాబు నాయుడు(Chandrababu, అచ్చెన్నాయుడు(Acham Naidu)తో పాటు సీబీఐ(CBI), ఈడీ(ED), కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రతివాదులుగా పేర్కొన్నారు ఉండవల్లి అరుణ్ కుమార్. ఓ వైపు చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్, పోలీస్ కస్టడీ పిటిషన్లపై చర్చ జరుగుతుండగా.. ఉండవల్లి అరుణ్ కుమార్ రిట్ పిటిషన్ దాఖలు చేయడం చంద్రబాబు అభిమానులు, టీడీపీ(TDP) శ్రేణులను ఉత్కంఠకు గురిచేస్తోంది.