KrishnaPriya At Raidurg Police station : రాయదుర్గం పోలీసులను ఆశ్రయించిన మాజీ మంత్రి నారాయణ తమ్ముడి 'భార్య'
మాజీ మంత్రి నారాయణపై(Ex-Minister Narayana) ఆయన తమ్ముడి భార్య కృష్ణప్రియ(Krishna Priya) ఇటీవల సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆదివారం టీడీపీ(TDP) నేత, మాజీమంత్రి నారాయణ, తన భర్త సుబ్రహ్మణ్యం తనను వేధిస్తూ బెదిరింపులకు గురిచేస్తున్నారని హైదరాబాదులోని రాయదుర్గం పోలీస్ స్టేషన్లో(Raidurg Police station) పొంగూరు కృష్ణప్రియ ఫిర్యాదు చేశారు.
మాజీ మంత్రి నారాయణపై(Ex-Minister Narayana) ఆయన తమ్ముడి భార్య కృష్ణప్రియ(Krishna Priya) ఇటీవల సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆదివారం టీడీపీ(TDP) నేత, మాజీమంత్రి నారాయణ, తన భర్త సుబ్రహ్మణ్యం తనను వేధిస్తూ బెదిరింపులకు గురిచేస్తున్నారని హైదరాబాదులోని రాయదుర్గం పోలీస్ స్టేషన్లో(Raidurg Police station) పొంగూరు కృష్ణప్రియ ఫిర్యాదు చేశారు. ఇటీవల తనను వేధింపులకు గురి చేసినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రియ గళమెత్తింది.
ఈ క్రమంలోనే తనకు న్యాయం చేయాలని కోరుతూ.. ఆమె హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. తనను వేధిస్తున్నారని రాయదుర్గం పీఎస్లో టీడీపీ మాజీ మంత్రి నారాయణపై ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియా వేదికగా ప్రియ ఇటీవల టీడీపీ మాజీమంత్రి నారాయణ హింసిస్తున్నారని వీడియోలు విడుదల చేశారు. తాను వీడియోలు విడదుల చేసిన తరువాత.. నారాయణ నుంచి వేధింపులు ఎక్కువయ్యాయని ప్రియ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తాను పోలీసులను ఆశ్రయించినట్లు ప్రియ పేర్కొన్నారు.