ప్రతినెలా రెండు వేల‌ కోట్లు తాడేపల్లి ప్యాలెస్‌కు వెళ్తున్నాయని మాజీమంత్రి దేవినేని ఉమా సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. లక్షల కోట్లు సంపాదించాడు.. పాపం జగన్ రెడ్డి చాలా పేదవాడంట.. మనం పెత్తందార్లమంట.. అంటూ ఎద్దేవా చేశారు. ఎన్ని అఘాయిత్యాలు చేయాలో అన్నీ చేశాడ‌ని విమ‌ర్శించారు.

ప్రతినెలా రెండు వేల‌ కోట్లు తాడేపల్లి(Thadepalli) ప్యాలెస్‌కు వెళ్తున్నాయని మాజీమంత్రి దేవినేని ఉమా(Devineni Uma) సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. లక్షల కోట్లు సంపాదించాడు.. పాపం జగన్ రెడ్డి(CM Jagan) చాలా పేదవాడంట.. మనం పెత్తందార్లమంట.. అంటూ ఎద్దేవా చేశారు. ఎన్ని అఘాయిత్యాలు చేయాలో అన్నీ చేశాడ‌ని విమ‌ర్శించారు. అడ్డగోలుగా అడ్డదారిలో గెలవాలని ప్రయత్నాలు చేస్తున్నార‌ని ఆరోపించారు. గొల్లపూడిలో ఓ అపార్ట్‌మెంట్‌లోని ఒక డోర్ నెంబర్ తో గ్రామంలో లేని 30 దొంగ ఓట్లను చేర్చారని.. ఎన్నికల ప్రధాన అధికారిని కలిసి దానిపై ఫిర్యాదు చేస్తానని వెల్ల‌డించారు.

గొల్లపూడి పార్టీ కార్యాలయం(Gollapudi TDP Office)లో క్లస్టర్, యూనిట్, పోలింగ్ బూత్ ఇంఛార్జ్‌లకు జరిగిన ఇంటిగ్రేటెడ్ శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో 5 కోట్ల మంద్రి ప్రజలు తీవ్ర నిరాశలో ఉన్నారని.. ఇలాంటి దుర్మార్గుడిని ఎందుకు ఎన్నుకున్నామని బాధపడుతున్నారని తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. వైసీపీ(YCP) పాలనలో ఎక్కడ చూసినా అవినీతి, అక్రమాలే.. ఒక్కచాన్స్‌ పేరుతో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశార‌ని అన్నారు. ప్రజా తీర్పు డిసెంబర్(December) లో రాబోతుందని పేర్కొన్నారు.

సీఎం(CM) రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నాడు.. ఓటర్ లిస్టు(Voter List)లపై శ్రద్ధ పెట్టండని సూచించారు. జులై 21 నుండి ఆగస్టు 21 వరకు జరిగే ఓటర్ జాబితా రివిజన్ చేయండి. చంద్రబాబు నాయుడు(Chandrababu) పడ్డ అవమానాల ముందు మనం ఏమన్నా పడ్డామా.. లోకేష్ బాబు(Lokesh) పడే కష్టంలో మనం పదిపైసలు పడ్డామా లేదో ఆత్మ విమర్శ చేసుకోండని శ్రేణుల‌కు సూచించారు. జూలై 21 నుంచి అధికారులు వస్తారు.. వారితో పాటు మీరు ప్రతి ఇంటికి వెళ్ళి ఏ సెక్షన్, ఏ మ్యాపింగ్ అనేది చూసుకోవాలని పేర్కొన్నారు. ప్రతి క్లస్టర్ పరిధిలో ఉన్న ప్రతి ఒక్క బూత్ స్థాయి కన్వీనర్ భాధ్యత తీసుకుని.. ఓటరు లిస్టు పరిశీలన చేసి అధికారులతో కలిసి పాల్గొని తప్పులను సరిచేయాలని అన్నారు. అంబేడ్కర్(BR Ambedkar) ఇచ్చిన రాజ్యాంగ హక్కు ఓటు హక్కు.. దానిని కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని అన్నారు.

Updated On 18 July 2023 10:02 PM GMT
Yagnik

Yagnik

Next Story