కాంగ్రెస్ మాజీ ఎంపీ చింతా మోహన్(MP Chinta Mohan) టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై(Chandrababu Arrest) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. శుక్ర‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అరెస్ట్ రాజకీయ కక్ష కారణంగానే జరిగిందని అన్నారు. చంద్రబాబు ఏ తప్పు చేయలేదని తాను నమ్ముతున్నానని అన్నారు.

కాంగ్రెస్ మాజీ ఎంపీ చింతా మోహన్(MP Chinta Mohan) టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై(Chandrababu Arrest) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. శుక్ర‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అరెస్ట్ రాజకీయ కక్ష కారణంగానే జరిగిందని అన్నారు. చంద్రబాబు ఏ తప్పు చేయలేదని తాను నమ్ముతున్నానని అన్నారు. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం వెనుక ఉన్నది బీజేపీనే(BJP) అని పాలు తాగే పిల్లవాడ్ని అడిగినా చెబుతారని వ్యాఖ్యానించారు. పేరుకే జగన్(Jagan), ఏపీ ప్రభుత్వం, సీఐడీ ఉన్నాయే కానీ.. చంద్ర‌బాబు అరెస్ట్‌ వెనుక ఢిల్లీ పెద్దల ప్రమేయం ఉందని.. ఇందులో ఎలాంటి అనుమానం లేదని సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. చంద్రబాబు అరెస్ట్ దుర్మార్గం అని ఖండించారు. చంద్రబాబు అమాయకుడని.. ఇది కావాలని చేసిన చర్యేనని అన్నారు.

Updated On 20 Oct 2023 6:45 AM GMT
Ehatv

Ehatv

Next Story