3 కాకుంటే 30 కేసులు పెట్టుకోమను: కొడాలి నాని

వైఎస్‌ జగన్‌ విజయవాడ జైలులో వల్లభనేని వంశీని పరామర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆయన ఆరోపించారు. వంశీపై కక్షతో చంద్రబాబు చేస్తున్న కుట్ర అని మండిపడ్డారు. వంశీ ఎలాంటి తప్పు చేయలేదని టీడీపీ ఆఫీస్‌లో పని చేసే సత్యవర్ధన్‌ చెప్పారు. పట్టాభి, ఆయన అనుచరులు కలిసి ఓ ఎస్సీ నేతపై దాడి చేశారు. అయినా వంశీపై తప్పుడు కేసులు పెట్టారు. పట్టాభి రెచ్చగొట్టడం వల్లే గన్నవరంలో టీడీపీ ఆఫీస్‌పై దాడి జరిగింది. వంశీని రెచ్చగొట్టేలా పట్టాభి నీచంగా మాట్లాడారు. పట్టాభిని చంద్రబాబే పంపించి గన్నవరంలో దాడి చేయించారన్నారు. ఈ సందర్భంగా అక్కడికి కొడాలి నాని కూడా వచ్చారు. ఆయనతో మాట్లాడేందుకు అక్కడ మీడియా ప్రతినిధులు ప్రయత్నించారు. కొడాలి నాని గారు.. ఇన్ని రోజులు ఏమైపోయారన్నారు. ఏమై పోలేదు.. ఎక్కడికి పోలేదు అని ఆయన బదులిచ్చారు. ఎక్కువగా కనిపించడంలేదని మీడియా ప్రతినిధి అడగ్గా.. ఉద్యోగం ఉడపీకితే ఏం చేస్తారు మరీ.. మీ ఉద్యోగం కూడా పీకితే.. రోజూ ఇలాగే మైక్‌ పట్టుకొని తిరుగుతారా చెప్పండని ఎదురు ప్రశ్నించారు. మీ ఇంటి అడ్రస్‌ చెప్పు రోజూ వచ్చి కలుస్తానని సెటైర్లు వేశారు. మీతో పాటు మరో ఇద్దరు మీడియా అధిపతులను రోజూ వచ్చి కలుస్తానన్నారు. నెక్స్ట్ మీరే అంటగా అని అడగ్గా.. నాపై 3 కేసులు కాకుంటే 30 కేసులు పెట్టుకోవాలని సవాల్‌ విసిరారు.

ehatv

ehatv

Next Story