Times Now ETG Survey : ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభంజనమే... టైమ్స్ నౌ సర్వే
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు(AP Elections) అమితాసక్తినికి కలిగిస్తున్నాయి. రోజుకో సర్వే వెలువడుతుండటం, ఎవరికి అనుకూలమైన ఫలితాలను వారు ఇచ్చుకోవడం పరిపాటిగా మారింది. అయితే కొన్ని సర్వే ఫలితాలు మాత్రం నిజం కావచ్చనిపిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు(AP Elections) అమితాసక్తినికి కలిగిస్తున్నాయి. రోజుకో సర్వే వెలువడుతుండటం, ఎవరికి అనుకూలమైన ఫలితాలను వారు ఇచ్చుకోవడం పరిపాటిగా మారింది. అయితే కొన్ని సర్వే ఫలితాలు మాత్రం నిజం కావచ్చనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి(Jagan Mohan Reddy) సంక్షేమం, అభివృద్ధి పథకాలు ప్రజలలో చొచ్చుకుపోయాయి. మరోవైపు విపక్షమైన కూటమి(TDP Alliance) చేజేతులా కొన్ని తప్పులు చేస్తున్నది. పెన్షన్లు ఇంటి దగ్గరకు రానీయకుండా చేసిన పాపం తెలుగుదేశంపార్టీదేనని(TDP) ప్రజలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) బ్రహ్మండమైన విజయాన్ని సాధిస్తుందని ప్రముఖ జాతీయ మీడియా టైమ్స్ నౌ(Times Now)-ఈటీజీ నిర్వహించిన సర్వేలో వెల్లడయ్యింది. ఈ సర్వే ఫలితాలపై గురువారం రాత్రి టైమ్స్ నౌ ఛానెల్ ఓ చర్చ కూడా నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్‌లో 21 నుంచి 22 లోక్‌సభ స్థానాలను వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గెల్చుకుంటుందని సర్వేలో తేలింది. తెలుగుదేశం, జనసేన(Janasena), బీజేపీ(BJP) కూటమి కట్టి జట్టుగా వచ్చినా ఓటమి తప్పదని సర్వే చెబుతోంది. బీజేపీ ఒక్క లోక్‌సభ సీటు కూడా గెలవదట!