రాబోయే ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని నిర్ణయించిన వైసీపీ అధినేత, సీఎం జగన్(CM Jagan) శ్రీకాకుళం(Srikakulam) జిల్లాపై ఫోకస్ పెట్టారు. జిల్లాలో సిట్టింగ్‎లను మార్చాలని భావిస్తున్న మూడు నియోజవకర్గాల్లో ఎచ్చెర్ల(Etcherla) ఒకటనే చర్చ తెరపైకి వచ్చింది. మరి..ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్‎(Gorle Kiran Kumar)ను మారిస్తే..అక్కడి నుంచి ఎవరిని పోటీ చేయిస్తారు? అనేదానిపై నియోజకవర్గంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

రాబోయే ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని నిర్ణయించిన వైసీపీ అధినేత, సీఎం జగన్(CM Jagan) శ్రీకాకుళం(Srikakulam) జిల్లాపై ఫోకస్ పెట్టారు. జిల్లాలో సిట్టింగ్‎లను మార్చాలని భావిస్తున్న మూడు నియోజవకర్గాల్లో ఎచ్చెర్ల(Etcherla) ఒకటనే చర్చ తెరపైకి వచ్చింది. మరి..ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్‎(Gorle Kiran Kumar)ను మారిస్తే..అక్కడి నుంచి ఎవరిని పోటీ చేయిస్తారు? అనేదానిపై నియోజకవర్గంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. సొంత సర్వేలతోపాటు ఐప్యాక్, ఇంటెలిజెన్స్ నివేదికలమీద ఆధారపడి మాత్రమే సీఎం జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎమ్మెల్యేపై పార్టీ శ్రేణులతోపాటు, ప్రజల్లో కూడా తీవ్ర వ్యతిరేకత వుందనే విషయం సర్వేల్లో బయట పడిందంట. ముఖ్యంగా సిట్టింగ్‎ను మార్చాలని పార్టీ నేతలే పట్టుబడుతుండటం కూడా మరో కారణమట. దీంతో ఎచ్చెర్ల సిట్టింగ్ అభ్యర్థిని మార్చాలని అధిష్టానం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే గొర్ల కిరణ్ కుమార్‎కు ఈసారి టికెట్ ఇవ్వబోమని అధిష్టానం తేల్చి చెప్పినట్లు సమాచారం.

ఎచ్చెర్ల అభ్యర్థిని మార్చాలని అధిష్టానం భావిస్తున్న తరుణంలో..అక్కడి నుంచి చిన్న శ్రీను(Chinna Srinu)ను పోటీ చేయిస్తారనే చర్చ తెరపైకి వచ్చింది. ప్రస్తుతం విజయనగరం జిల్లా వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడిగా చిన్నశ్రీను ఉన్నారు. ఆయనను ఎచ్చెర్ల నుంచి ఎన్నికల బరిలో దించుతారనే ప్రచారం ఎప్పట్నుంచో సాగుతోంది. ఈ నేపథ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యే గొర్లె కిరణ్, చిన్నశ్రీనును తాడేపల్లి(Tadepalli)కి పిలిచి మాట్లాడినట్టు సమాచారం. మరోవైపు మంత్రి బొత్స సమీప బంధువు, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ (Chandra sekhar)కూడా టికెట్ ఆశిస్తున్నారట. ఎచ్చెర్లలో డిసైడింగ్ ఫ్యాక్టర్‎గా తూర్పుకాపు సామాజికవర్గం ఉండటంతో.. పోటీ చేసేందకు ఆయన ఆసక్తి చూపిస్తున్నారట. అయితే సామాజిక బస్సు యాత్ర విజయవంతం చేసిన కిరణ్‌ను(Kiran) అంత సులువుగా మర్చబోరని మరొక వాదన వినిపిస్తోంది. చిన్నశ్రీనుకు జెడ్పీ చైర్మన్ ఉంది కాబట్టి.. కిరణ్‌కు మరో ఛాన్స్‌ ఇవ్వాలని పార్టీ భావిస్తున్నట్టు అంతా అనుకుంటున్నారు. కానీ.. సీఎంవో నుంచి వీళ్లిద్దరిని పిలిచి మాట్టాడాటంతో కిరణ్‌ మార్పు తప్పదన్న చర్చ ఊపందుకుంది.

ఇక ప్రతిపక్ష టీడీపీ (TDP)కూడా ఎచ్చెర్లపై సీరియస్ గానే ఫోకస్ పెట్టింది. ఒకప్పుడు శ్రీకాకుళం తెలుగుదేశం పార్టీకి కంచు కోట. కానీ.. 2019 నాటికి జిల్లాలో రెండు సీట్లకు పరిమితమైంది. ఈసారి అన్నీ అనుకూలిస్తే మెజారిటీ సీట్లు గెలుచుకోవాలని వ్యూహరచన చేస్తోంది. ఇక్కడి నుంచి సీనియర్ నేత కళా వెంకటరావు (Kala venkatrao)టికెట్ ఆశిస్తున్నారు. అలాగే కలిశెట్టి అప్పలనాయుడు(Appalanaidu) ఈ సీటు కోసం గట్టిగానే ప్రయత్నిస్తునారు. విజయనగరం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నేత కలిశెట్టికి మద్దతుగా ఉన్నారనే ప్రచారం ఉంది. రాజమండ్రి మహానాడులో చంద్రబాబు ఈయనకు సత్కారం కూడా చేశారు. ఈ ఇద్దరు నేతల మధ్య వర్గపోరు పార్టీ నేతలను కలవరపెడుతోంది. గత ఎన్నికల్లో సమన్వయ లోపంవల్లే సీటు కోల్పోయామనే భావన పార్టీ నేతల్లో ఉంది. వర్గ పోరు ఫలితంగా టీడీపీకి సిక్కోలులో మరోసారి చుక్కెదురు అవుతుందా అన్న ఆందోళన కేడర్‎లో కనిపిస్తోంది.

Updated On 21 Dec 2023 4:01 AM GMT
Ehatv

Ehatv

Next Story