ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అరుదైన అవకాశం దొరికింది. అగ్ర దేశం అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ లోకి విద్యార్థులకు ఎంట్రీ ల‌భించింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల(AP Students)కు అరుదైన అవకాశం దొరికింది. అగ్ర దేశం అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్(White House) లోకి విద్యార్థులకు ఎంట్రీ ల‌భించింది. వైట్ హౌస్ లో ఉన్న విభాగాలను అధికారులు విద్యార్థులకు వివరించారు. ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్(International Monitoring Fund) కార్యాలయం అధికారులతో కూడా విద్యార్థులు భేటీ అయ్యారు. ఏపీ విద్యా విధానాలను ఐఎంఎఫ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గీత గోపీనాథ్(Geetha Gopinath) మెచ్చుకున్నారు.

పది రోజులపాటు పలు అంతర్జాతీయ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు విద్యార్ధుల‌ను సీఎం వైఎస్ జగన్(CM YS Jagan) అమెరికా పంపారు. ఈ క్ర‌మంలోనే వైట్ హౌస్ ఎంట్రీ ద‌క్క‌డం అసమాన్యం, మన విద్యార్థులకే దక్కిన అరుదైన అవకాశంగా భావిస్తున్నారు.

ఇప్పటికే అమెరికా ప్రభుత్వ ప్రతినిధులతో మన విద్యార్థులు భేటీ అయ్యారు. ఐక్యరాజ్యసమితి(United Nations) ప్రధాన కార్యాలయంలో విద్యార్థులు ఎస్డిజి సమ్మిట్ లో పాల్గొన్నారు. విద్యార్ధులు వాషింగ్టన్ లో వరల్డ్ బ్యాంక్(World Bank) ప్రతినిధులతో కూడా భేటీ అయ్యారు. ఐక్యరాజ్యసమితి సభ్యుడు ఉన్నవ షకీన్ కుమార్ నేతృత్వంలో అమెరికా పర్యటన(America Visit) కొన‌సాగుతుంది.

Updated On 28 Sep 2023 9:44 PM GMT
Yagnik

Yagnik

Next Story