ఇది కూడా గృహహింస కేసే(Domestic voilence case)! కాకపోతే ఇక్కడ భర్త హింసించబడుతున్నాడు. కట్టుకున్న భార్య(Wife) అతగాడిని రోజూ పొట్టుపొట్టు కొడుతున్నదట! ఇక ఆ హింస భరించలేక పోలీసులను ఆశ్రయించాడు. భార్య నుంచి తనతో పాటు తన తల్లిదండ్రులకు కూడా ప్రాణహాని ఉందని చెబుతూ కాపాడండి మహోప్రభో అంటూ వేడుకున్నాడు.

ఇది కూడా గృహహింస కేసే(Domestic voilence case)! కాకపోతే ఇక్కడ భర్త హింసించబడుతున్నాడు. కట్టుకున్న భార్య(Wife) అతగాడిని రోజూ పొట్టుపొట్టు కొడుతున్నదట! ఇక ఆ హింస భరించలేక పోలీసులను ఆశ్రయించాడు. భార్య నుంచి తనతో పాటు తన తల్లిదండ్రులకు కూడా ప్రాణహాని ఉందని చెబుతూ కాపాడండి మహోప్రభో అంటూ వేడుకున్నాడు. ఆంధ్రప్రదేశ్‌లోని(Andhra Pradesh) రాజోలుకు చెందిన టెమూజిన్‌కు అమలాపురానికి చెందిన లక్ష్మీ గౌతమితో ఏడేళ్ల కిందట వివాహం జరిగింది. టెమూజిన్‌ మల్లారెడ్డి కాలేజీలో ఇంగ్లీష్‌ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నాడు. పెళ్లయిన నాటి నుంచే తనను మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నదంటూ భర్త ఆవేదన వ్యక్తం చేశాడు. ఒంటిపై గాయాలు కూడా చూపించాడు. అకారణంగా గొడవపడి కొడుతున్నదని, పెద్దలు చాలా సార్లు నచ్చిచెప్పి చూశారని, అయినా ఆమె తీరు మారడం లేదని అన్నాడు. మొన్నామధ్య తనను చంపడానికి కత్తితో దాడి చేసిందని, ఈ విషయంపై స్థానిక అల్వాల్‌ పోలీస్‌స్టేషన్‌లో కంప్లయింట్‌ కూడా చేశానని టెమూజిన్‌ చెప్పుకొచ్చాడు. పోలీసులు మాత్రం కేసు నమోదు చేయడం లేదని ఆరోపించాడు. నిన్నటి నుంచి తాను భయంతో ఇంటికెళ్లలేదని, వెళితే తనపై దాడి చేస్తుందన్నాడు. అయితే భర్త ఆరోపణలను లక్ష్మీ గౌతమి ఖండించింది. ఆయన చెబుతున్నదంతా అబద్ధమని, ఆయనపై తానే పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపింది.

Updated On 21 May 2024 12:12 AM GMT
Ehatv

Ehatv

Next Story