ఏలూరు(Eluru) రాజకీయాలు ఎప్పుడూ ఉత్కంఠంగానే ఉంటాయి. ఎన్నికలొచ్చే దాకా.. అక్కడ పోటీ చేసే అభ్యర్థులెవరో అంచనా వేయడం కష్టం. కానీ..ఈసారి అధికార పార్టీ వైసీపీతోపాటు..జనసేన నేతలు కూడా ఏలూరుపై ఆశలు పెట్టుకున్నారు. మరి.. వైసీపీ టికెట్.. సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల నానికే దక్కుతుందా? పొత్తులో పోటీ చేస్తే..జనసేనకు(Janasena) ఏలూరు పట్టం కడుతుందా? ఏలూరులో ఈసారి కనిపించబోయే సీనేంటి? ఓసారి చూద్దాం.

ఏలూరు(Eluru) రాజకీయాలు ఎప్పుడూ ఉత్కంఠంగానే ఉంటాయి. ఎన్నికలొచ్చే దాకా.. అక్కడ పోటీ చేసే అభ్యర్థులెవరో అంచనా వేయడం కష్టం. కానీ..ఈసారి అధికార పార్టీ వైసీపీతోపాటు..జనసేన నేతలు కూడా ఏలూరుపై ఆశలు పెట్టుకున్నారు. మరి.. వైసీపీ టికెట్.. సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల నానికే దక్కుతుందా? పొత్తులో పోటీ చేస్తే..జనసేనకు(Janasena) ఏలూరు పట్టం కడుతుందా? ఏలూరులో ఈసారి కనిపించబోయే సీనేంటి? ఓసారి చూద్దాం.

ప్రస్తుతం..ఏలూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ల నాని(Alla Nani).. ఈ నియోజకవర్గం నుంచి 3 సార్లు విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థులు ఐదు సార్లు గెలిచారు. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసిన ఆళ్ల నాని.. స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. గత రెండు దశాబ్దాలుగా ఆళ్ల నాని, బడేటి బుజ్జి(Badeti Bujji) మధ్యే రాజకీయం నడుస్తోంది. ఇక్కడ కాపు, తూర్పు కాపు, వైశ్య సామాజిక వర్గాల ఓట్ బ్యాంక్ ఎక్కువ. ఎవరు.. ఏ పార్టీ నుంచి పోటీ చేసినా..ఎక్కువగా ఎమ్మెల్యేలుగా ఎన్నికైంది కాపు సామాజికవర్గం నేతలే. ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్లనానిని..గ్రూపు తగాదాలు వెంటాడుతున్నాయి. ఏలూరులో ఆళ్ల నాని వర్సెస్ పెదబాబు అన్నట్లుగా వర్గపోరు నడుస్తోంది. మేయర్ నూర్జహాన్ భర్త ఎస్ఎంఆర్ పెదబాబు.. ఇక్కడి నుంచి టికెట్ ఆశిస్తున్నారని సమాచారం. అటు అధిష్టానం కూడా నానిని ఏలూరు పార్లమెంట్(Parliament) బరిలో దించే ఆలోచనలో ఉందనే ప్రచారం కూడా ఉంది. అయితే.. ఆళ్ల నాని మాత్రం.. ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది.

అధికార పార్టీలో ఉన్న వర్గపోరును క్యాష్ చేసుకోవాలనే ఆలోచనతో ఉంది టీడీపీ(TDP). అయితే టీడీపీ-జనసేన పొత్తుతో ఈ సీటును ఎవరికి కేటాయిస్తారనే చర్చ రెండు పార్టీల్లోనూ ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఏలూరులో గెలిచిన పార్టీ అధికారాన్ని చేజిక్కించుకుంటుందనేది ఓ సెంటిమెంట్. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత కొన్ని గ్రామాలు ఏలూరు నుంచి దెందులూరు(Denduluru) నియోజకవర్గానికి కలిసినా,, గెలుపు సెంటిమెంట్ మాత్రం నిజమవుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ-జనసేన కూటమి పొత్తులో ఏలూరు సీటును టీడీపీ వదులకుని జనసేనకు కట్టబెడుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అక్కడ పార్టీ ఇంఛార్జీగా ఉన్న రెడ్డి అప్పలనాయుడికి(Reddy Appalanaidu).. పవన్ కల్యాణ్ పోటీ చేసే అవకాశం ఇస్తారా? లేదా? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్‎గా ఉంది. మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి అల్లుడు పవన్ కల్యాణ్‌కు బంధువు కావడంతో.. ఆయన్నే పోటీలో ఉంచుతారనే టాక్ వినిపిస్తోంది. ఎవరిని బరిలో దించినా.. ఏలూరులో జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు స్థానిక జనసేన నాయకులు. అయితే..ఈసారి గెలుపు అంత సులువు కాదనే ఆసక్తికర చర్చ ఏలూరు నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది.

Updated On 23 Dec 2023 6:31 AM GMT
Ehatv

Ehatv

Next Story