బాబుపై జగన్‌ సెటైర్లు

ఎన్నికల(Elections) ముందు బోల్డన్ని హామీలిస్తారు. మేనిఫెస్టోలో సంక్లిష్టమైన వాగ్దానాలను ప్రచురిస్తారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీలను నెరవేస్తున్నామని ఓటర్ల చెవిలో క్యాబేజీ పూలు పెడతారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత గద్దె దిగిన ప్రభుత్వాన్ని ఆడపోసుకోవడం మొదలు పెడతారు. తెలంగాణలోనైనా(Telangana), ఆంధ్రప్రదేశ్‌లోనైనా(andhra Pradesh) ఇదే తంతు. రేవంత్‌రెడ్డి(Revanth reddy) అధికారంలోకి వచ్చిన వెంటనే తాను లంకెబిందెలు ఉంటాయనుకున్నానని, ఏమీ లేవని చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబునాయుడు(Chandrababu) కూడా ఇంచుమించు ఇలాంటి డైలాగులే చెబుతున్నారు. మొన్న ఆయన మాట్లాడుతూ 'నేనైతే ఈ రోజు ఎంతో ఆశతో వచ్చాను. అన్ని అనౌన్స్‌ చేయాలని. కానీ ఈ రోజు మీరు చూస్తే ఖజానా దివాలా తీసింది. మనకు వచ్చే ఆదాయం అప్పులు కట్టడానికి కూడా చాలే పరిస్థితి లేదు' అంటూ తన అశక్తతను బయటపెట్టుకున్నారు. అంటే ఇచ్చిన గ్యారంటీలు ఇప్పట్లో అమలు కావని అర్థమవుతోంది. ఇదే ముక్కను మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ(YCP) అధినేత వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి(YS Jagan) వెటకారంతో చెప్పారు. ' జగన్‌ పలావు పెట్టాడు. అధికారంలోకి రాగానే చంద్రబాబునాయుడు బిర్యానీ పెడతానన్నాడు. చంద్రబాబును నమ్మి ఓటేసినారు. బిర్యానీ పాయె.. పలావు పాయె.. లాస్టుకు పస్తు పండుకోవాల్సిన పరిస్థితి' అని జగన్‌ సెటైర్లు విసిరారు. ప్రస్తుతం జగన్‌ వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.



Eha Tv

Eha Tv

Next Story