నేడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక జరగనుంది. శ‌నివారం ఉదయం 10 గంటల నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఒంటి గంట నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను పరిశీలిస్తారు. అనంతరం గంట పాటు అంటే సాయంత్రం నాలుగు గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతుంది.

నేడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక(Election of TDP National President) జరగనుంది. శ‌నివారం ఉదయం 10 గంటల నుంచి నామినేషన్ల ప్రక్రియ(Nominations) ప్రారంభం అవుతుంది. ఒంటి గంట నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను పరిశీలిస్తారు. అనంతరం గంట పాటు అంటే సాయంత్రం నాలుగు గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతుంది. అవసరమైతే సాయంత్రం 4 నుంచి ఆరు గంటల వరకు ఓటింగ్(Voting) జరుగుతుంది. రాత్రి ఏడు గంటలకు ఎన్నికైన జాతీయ అధ్యక్షుడి(National President) పేరును ఎన్నికల కమిటీ ప్రకటిస్తుంది. ప్రతి రెండేళ్లకు ఒకసారి అధ్యక్షుడిని ఎన్నుకోవడం ఆనవాయితీ కాగా.. కరోనా(Corona) కారణంగా ఈసారి జాప్యం జరిగింది. అధ్యక్షుడి ఎన్నిక కోసం కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు(Ashok Gajapathi Raju) ఆధ్వర్యంలో ఎన్నికల కమిటీని పొలిట్ బ్యూరో నియమించింది. అయితే.. చంద్రబాబు(Chandrababu) ఎన్నిక లాంఛనమేనని టీడీపీ(TDP) వ‌ర్గాలు చెబుతున్నాయి.

Updated On 26 May 2023 9:31 PM GMT
Yagnik

Yagnik

Next Story