ఈ దాడి ఘటనపై విచారణకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. రేపటి బస్సు యాత్రకు
సీఎం జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన రాయి దాడి గురించి ఎన్నికల కమిషన్ ఆరా తీసింది. ఈ ఘటనపై విజయవాడ సీపీతో ఏపీ సీఈఓ ముఖేశ్ కుమార్ మీనా ఫోన్‌లో మాట్లాడారు. దీనికి సంబంధించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. నిందితులను త్వరగా గుర్తించాలని సీపీకి సూచించారు. దాడిలో గాయపడ్డ సీఎం జగన్‌ను విశ్రాంతి తీసుకోవాల్సిందిగా వైద్యులు సూచించారు. నుదుటిపై వాపు ఎక్కువగా ఉండటంతో రెస్ట్ అవసరమని చెప్పడంతో సీఎం జగన్ తన యాత్రకు నేడు విరామం ఇచ్చారు.
ఈ దాడి ఘటనపై విచారణకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. రేపటి బస్సు యాత్రకు సెక్యూరిటీలో మార్పులు చేయాలని పోలీస్ శాఖ నిర్ణయం తీసుకుంది. సీఎం జగన్ పై క్యాట్ బాల్ తో దాడి చేసినట్లు అనుమానం వ్యక్తం అవుతుంది. రాయి తగలడంతో సీఎం జగన్ ఎడమకంటి కనుబొమ్మపై తీవ్ర గాయం అయింది. సీఎం జగన్ పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఎడమ కంటికి సైతం గాయం అయింది.