Vizianagarm By Election : విజయనగరం ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రద్దు
ఎన్నికల సంఘం(Election commision) ఓ కీలక నిర్ణయం తీసుకుంది.
ఎన్నికల సంఘం(Election commision) ఓ కీలక నిర్ణయం తీసుకుంది. విజయనగరం(Vizianagaram) స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికను(MLC By ELection) రద్దు చేసింది. ఎమ్మెల్సీ రఘురాజుపై అనర్హత(MLC Disqualification) వేటు చెల్లదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు(AP High court) ఇటీవల తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఉప ఎన్నికను రద్దు చేస్తూ ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. విజయనగరం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) ఎమ్మెల్సీ అభ్యర్థిగా సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే శంబంగా చిన్న అప్పలనాయుడి(Appala naidu) పేరును వైఎస్ జగన్మోహన్‌రెడ్డి(YS Jagan) ఖరారు చేసిన సంగతి తెలిసిందే. వెలమ సామాజిక వర్గానికి చెందిన అప్పలనాయుడును నిలబెడితే పార్టీకి అడ్వాంటేజ్‌గా ఉంటుందని ఉత్తరాంధ్ర నాయకుల అభిప్రాయాన్ని జగన్ మన్నించారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా గెలిచిన రఘురాజు ఎన్నికల ముందు పార్టీ మారారు. దాంతో రఘురాజుపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. మండలి ఛైర్మన్ మోషెన్ రాజు ఆయనపై అనర్హత వేటు వేశారు. దాంతో రఘురాజు కోర్టును ఆశ్రయించారు. కోర్టు రఘురాజుపై అనర్హత వేటు చెల్లదని తీర్పు చెప్పింది. అయితే అప్పటికే ఎమ్మెల్సీ ఉ ఎన్నిక షెడ్యూల్‌ను ఈసీ విడుదల చేసింది. కోర్టు తీర్పుతో ఉప్ ఎన్నికను రద్దు చేసింది.