Jai Bharath National Party : జైభారత్ నేషనల్ పార్టీ ఎన్నికల గుర్తు ఏమిటో తెలుసా?
జైభారత్ నేషనల్ పార్టీకి(Jai Bharath National Party) కేంద్ర ఎన్నికల కమిషన్(Election commission) కామన్ సింబల్ ని ప్రకటించింది. ఈ మేరకు ఎన్నికల కమిషన్ నుంచి ఉత్తర్వులు తమకు అందాయని లక్ష్మీనారాయణ(Lakshmi Narayana) ఒక ప్రకటనలో తెలిపారు.

Jai Bharath National Party
జైభారత్ నేషనల్ పార్టీకి(Jai Bharath National Party) కేంద్ర ఎన్నికల కమిషన్(Election commission) కామన్ సింబల్ ని ప్రకటించింది. ఈ మేరకు ఎన్నికల కమిషన్ నుంచి ఉత్తర్వులు తమకు అందాయని లక్ష్మీనారాయణ(Lakshmi Narayana) ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లోని అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలకు, అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికల కామన్ సింబల్ గా బ్యాటరీ టార్చ్(Battery tourch) ని కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించినట్లు లక్ష్మీనారాయణ తెలిపారు. పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలన్నింటికీ ఒకే ఒక కామన్ సింబల్ బ్యాటరీ టార్చ్ రావడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. అంధకారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ కి వెలుగు దివ్వెగా జైభారత్ నేషనల్ పార్టీ బ్యాటరీ టార్చ్ వెలిగిస్తుందన్నారు.
