AndhraPradesh: ఏపీలో ఎన్నికల అనంతరం హింస.. వారి సస్పెండ్
ఏపీలో ఎన్నికల అనంతరం హింస చెలరేగింది. అధికారులు ఈ గొడవలను
ఏపీలో ఎన్నికల అనంతరం హింస చెలరేగింది. అధికారులు ఈ గొడవలను కట్టడి చేయడంలో విఫలమవడంతో ఈసీ కఠిన చర్యలు తీసుకుంది. హింసపై దర్యాప్తునకు సిట్ ఏర్పాటు చేసి.. రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఇక పలువురు అధికారులపై వేటు వేసింది. పల్నాడు కలెక్టర్, తిరుపతి ఎస్పీపై ఈసీ బదిలీ వేటు వేయగా, పల్నాడు, అనంతపురం ఎస్పీలను సస్పెన్షన్ చేసింది. పల్నాడు, అనంతపురం, తిరుపతి లోని 12 మంది సబ్బార్డినేట్ పోలీస్ అధికారులను సస్పెండ్ చేసింది ఈసీ. శాఖపరమైన విచారణ చేపట్టాలని.. అల్లర్లకు పాల్పడిన వారిపై ఛార్జ్‌షీట్ దాఖలు చేయాలని ఈసీ ఆదేశించింది. హింసాత్మక ఘటనలపై చర్యలు తీసుకోవాలని సీఎస్, డీజీపీలను ఆదేశించింది ఈసీ. 25 కంపెనీల పారా మిలటరీ బలగాలను కొనసాగించాలని సూచించింది.
ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ గుప్తా కేంద్ర ఎన్నికల సంఘం ముందు హాజరయ్యారు. రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తరువాత హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవటాన్ని కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. దీనిపై స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తాను ఆదేశించింది.