ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఎలక్షన్ కోడ్‌ను ఎత్తివేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఎలక్షన్ కోడ్‌ను ఎత్తివేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 16న ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నాటి నుంచి కోడ్ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. పల్నాడుపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. మళ్లీ అల్లర్లు చెలరేగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. పల్నాడులో విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని, ప్రతి ఒక్కరూ విధిగా పోలీసుల మార్గదర్శకాలను పాటించాలని ఎస్పీ మలికా గార్గ్ స్పష్టం చేశారు.
2024 సార్వత్రిక ఎన్నికల ఈ ఏడాది మార్చి 16వ తేదీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుండి అమల్లోకి వచ్చిన ఈ ప్రవర్తన నియమావళి జూన్ 4న ఓట్ల లెక్కింపు ముగిసిన తదుపరి 48 గంటల వరకు అమల్లో ఉంది. ఇప్పుడు నలబై ఎనిమిది గంటలు పూర్తయినందున కోడ్ ఎత్తివేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు పరిపాలన అంతా ఈసీ కనుసన్నల్లోనే జరుగుతుంది. కానీ కోడ్ ఎత్తేశాక పూర్తిగా ప్రభుత్వం అధీనంలోకి వస్తుంది. ప్రస్తుతం ఏపీలో ఆపద్ధర్మ ప్రభుత్వం ఉంది. ఆపద్ధర్మ సీఎంగా జగన్ కొనసాగుతారు.