ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) రాజకీయపార్టీలన్నింటికీ వార్తా పత్రికలు ఉన్నాయి. తెలుగుదేశంపార్టికైతే(TDP) చాలా ఉన్నాయి. పార్టీల వారీగా న్యూస్‌ ఛానెళ్లు కూడా ఉన్నాయి. ఒక పత్రికలో వచ్చిన వార్తకు ఇంకో పత్రికలో(News) వచ్చిన వార్తకు ఏ మాత్రం సంబంధం లేకుండా ఉంటోంది. ఎగ్జాంపుల్‌ శుక్రవారం జనసేన(Janasena) అధినేత పవన్‌ కల్యాణ్‌(Pawan kalyan) గణతంత్ర వేడుకల(Republic) సందర్భంగా చేసిన కొన్ని రాజకీయపరమైన వ్యాఖ్యలను ఒక్కో పత్రిక ఒక్కో తీరుగా రిపోర్ట్‌ చేసింది.

ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) రాజకీయపార్టీలన్నింటికీ వార్తా పత్రికలు ఉన్నాయి. తెలుగుదేశంపార్టికైతే(TDP) చాలా ఉన్నాయి. పార్టీల వారీగా న్యూస్‌ ఛానెళ్లు కూడా ఉన్నాయి. ఒక పత్రికలో వచ్చిన వార్తకు ఇంకో పత్రికలో(News) వచ్చిన వార్తకు ఏ మాత్రం సంబంధం లేకుండా ఉంటోంది. ఎగ్జాంపుల్‌ శుక్రవారం జనసేన(Janasena) అధినేత పవన్‌ కల్యాణ్‌(Pawan kalyan) గణతంత్ర వేడుకల(Republic) సందర్భంగా చేసిన కొన్ని రాజకీయపరమైన వ్యాఖ్యలను ఒక్కో పత్రిక ఒక్కో తీరుగా రిపోర్ట్‌ చేసింది. ఒకప్పుడంటే ఏమో అనుకోవచ్చు కానీ ఇప్పుడు పత్రికలు రాసే వార్తలను ఎవరూ నమ్మడం లేదు. పవన్‌ కల్యాణ్‌ ఏం మాట్లాడారో సోషల్‌ మీడియాలో(Social media) ఉంటుంది. ఆయన మాట్లాడిన వీడియోలు సోషల్‌ మీడియాలో ఈజీగా దొరికేస్తాయి. ప్రజలు నిజానిజాల కోసం సోషల్‌ మీడియాపై ఆధారపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో శనివారం నుంచి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ(YSRCP) ఎన్నికల శంఖారావాన్ని పూరించింది. భీమిలి కేంద్రంగా సిద్ధం పేరుతో బహిరంగసభలు నిర్వహిస్తున్నది. ఆ సభలలో జగన్‌ ఏం మాట్లాడతారు? ఆయన మాటల్లోని నిజానిజాలేమిటి? ఇవన్నీ మీడియాలో రాసుకోవచ్చు .. అందులో ఎలాంటి తప్పులేదు. చాన్నాళ్లుగా టీడీపీ అనుకూల మీడియా చేస్తున్నట్టుగానే ఈ సభలపై కూడా దుష్ప్రచారం చేసుకోవచ్చు. జగన్‌(CM Jagan) సభ మొదలు పెట్టగానే ప్రజలు లేచి వెళ్లిపోయారంటూ రాతలు రాసుకోవచ్చు. సభ ప్రారంభానికి మూడు నాలుగు గంటల ముందు తీసిన ఫోటోను ప్రచురించుకోవచ్చు. ఎవరూ అభ్యంతర పెట్టరు. ఎందుకంటే ఆయా మీడియాల నైజమేమిటో ప్రజలకు తెలుసు కాబట్టి. అయితే శనివారం ఈనాడులో వచ్చిన ఓ వార్త కథనం పరమ రోతగా ఉంది. కడుపులో ఉన్న విషమంతా కక్కేసింది. అర్జెంట్‌గా జగన్‌ దిగిపోయి చంద్రబాబు సీఎం కావాలని ఉబలాటపడుతున్నట్టుగా ఉంది. ఇంత బరితెగింపు రాతలు గతంలో ఎప్పుడూ ఈనాడులో చూసి ఉండరు. సిద్ధం సభకు సంబంధించి ఓ కథనాన్ని రాసింది. సిద్ధం పేరుతో ర్యాంప్ వాక్‌ చేస్తున్నారు ముఖ్యమంత్రి అని రాసుకొచ్చింది. ఇది పార్టీ కార్యకర్తల కోసం పెట్టిన సభ. ఆయన కార్యకర్తలను కలుసుకోవడానికి ర్యాంప్‌ పెట్టుకుంటారు. మరోటి పెట్టుకుంటారు. ఈనాడుకు వచ్చిన బాధేమిటో అర్థం కావడం లేదు. ర్యాంప్‌ వాక్‌ అని ఎందుకు రాసిందో ఈనాడు పెద్దలకే తెలియాలి. లోకేశ్‌ యువగళంలో కూడా ఇలాంటి ర్యాంప్‌లను పెట్టారు. యువగళం సభలలో కూడా ఆయన ర్యాంప్‌ మధ్యలోకి వచ్చి మాట్లాడారు. మరి ఆ రోజు ఈనాడు ఎందుకు రాయలేదు? కనిపించలేదా? కళ్లకు గంతలు కట్టుకుందా? లోకేశ్‌ స్వకులం కాబట్టి, తమ పత్రిక టీడీపీ అంటకాకుతుందని రాయలేదా? అసలు ఈనాడు ఉద్దేశమేమిటి? ఈ వీడియోలో చూద్దాం

Updated On 27 Jan 2024 7:43 AM GMT
Ehatv

Ehatv

Next Story