రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 12 నుంచి పాఠశాలలు పున:ప్రారంభం అవుతాయని, అదే రోజున విద్యార్థులకు విద్యా కానుకను అందించనున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రిబొత్స సత్యనారాయణ అన్నారు. విజయవాడలోని సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయ‌న‌ మాట్లాడుతూ.. పాఠశాలలు పున: ప్రారంభ రోజునే విద్యా కానుకలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది రూ. 1100 కోట్లు ఖర్చు పెట్టి విద్యార్థులకు యూనిఫాం, బూట్లు, సాక్సులు, బెల్ట్, స్కూల్ బ్యాగ్, బైలింగ్వల్ టెక్ట్స్ బుక్స్, వర్క్ బుక్స్, డిక్షనరీ అందిస్తున్నామని తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 12 నుంచి పాఠశాలలు పున:ప్రారంభం(Schools Reopen) అవుతాయని, అదే రోజున విద్యార్థులకు విద్యా కానుక(Jagananna Vidya Kanuka)ను అందించనున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి(Education Minister) బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) అన్నారు. విజయవాడ(Vijayawada)లోని సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయ‌న‌ మాట్లాడుతూ.. పాఠశాలలు పున: ప్రారంభ రోజునే విద్యా కానుకలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది రూ. 1100 కోట్లు ఖర్చు పెట్టి విద్యార్థులకు యూనిఫాం, బూట్లు, సాక్సులు, బెల్ట్, స్కూల్ బ్యాగ్, బైలింగ్వల్ టెక్ట్స్ బుక్స్, వర్క్ బుక్స్, డిక్షనరీ అందిస్తున్నామని తెలిపారు.

పల్నాడు(Palnadu) జిల్లా పెదకూరపాడు(Peddakurapadu) నియోజకవర్గంలోని క్రోసూరు(Krosooru)లో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి(YS Jagan) విద్యా కానుకను లాంచనంగా ప్రారంభిస్తారన్నారు. విద్యాకానుక మొదటి రోజునే విద్యార్థులకు అందించాలన్న దృడ సంకల్పంతో అధికారులు చేసిన కృషి ఎనలేనిదన్నారు. నాణ్యతకు పెద్దపీట వేస్తూ 4 దశల్లో క్వాలీటీ చెక్(Quality Check) చేసి మరీ పాఠశాలలకు పంపినట్లు చెప్పారు. ఇప్పటికే దాదాపు 90 శాతంకు పైగా పాఠశాలలకు రవాణా చేశామని చెప్పారు. మరో రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో ఆయా పాఠశాలలకు చేరుస్తామన్నారు. పండగ వాతావారణంలో విద్యార్థులకు విద్యా కానుక అందిస్తున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. విద్యాకానుకలో భాగంగా అందించే వస్థువుల నమూనా అన్ని మండలాల్లో ఏర్పాటు చేశామని తెలిపారు.

ఆణిముత్యాలు(Animuthyalu)కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతూ పదవ తరగతి(10th Class), ఇంటర్ పరీక్షా(Inter) ఫలితాల్లో ప్రతిభ చూపి ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానల్లో నిలిచిన విద్యార్థుల అభినందన కార్యక్రమం ఈ నెల 20న రాష్ట్ర స్థాయిలో మన ముఖ్యమంత్రి చేతుల మీదుగా నగదు పురష్కారం, సర్టిఫికెట్, మెమోంటోలను విద్యార్థులకు అందించనున్నట్లు చెప్పారు. విద్యార్థులతో పాటు వారి తల్లితండ్రులను, ప్రధానోపాధ్యాయులను సత్కరించి ప్రోత్సహిస్తున్నారని చెప్పారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 6,568 హైస్కూళ్లలో ఆయా పాఠశాలల నిర్వహణ కమిటీ, తల్లితండ్రులు, స్థానిక ప్రజా ప్రతినిధుల సమక్షంలో ఈ నెల 12 నుంచి 19 వరకు మెరిట్ విద్యార్థులను సన్మానించటం, ఈ నెల 15న నియోజకవర్గస్థాయిలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థుల అభినందన కార్యక్రమం, ఈ నెల 17న జిల్లా స్థాయిలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులను సత్కరిస్తున్నట్లు చెప్పారు. నియోజకవర్గ స్థాయిలో మొదటి మూడు స్థానాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు వరుసగా రూ. 15వేలు, రూ. 10వేలు, రూ. 5వేలు, మెడల్, సర్టిఫికెట్ అలాగే జిల్లా స్థాయిలో ప్రతిభ చూపిన వారికి వరుసగా రూ. 50వేలు, రూ. 30వేలు, రూ. 15వేలు తో పాటు మెడల్, సర్టిఫికెట్, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చూపి మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు వరుసగా రూ. లక్ష, రూ. 75వేలు, రూ. 50వేలు అందిస్తున్నట్లు తెలిపారు. మొత్తంగా పదవ తరగతి, ఇంటర్మీడియట్ స్థాయిల్లో కలిపి 22,768 మంది విద్యార్థులను సత్కరిస్తున్నట్లు తెలిపారు.

గతేడాదితో పోల్చితే ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యర్థుల ఉత్తీర్ణత శాతం పెరిగిందిని, అలాగే వారు వ్యక్తిగతంగా సాధించిన మార్కుల్లో సైతం గణనీయంగా పెరుగుదల ఉందని హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని 45 వేల పాఠశాలల్లో నాడు – నేడులో భాగంగా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని, ఇప్పటికే మొదటి దశలో 15వేల పాఠశాలల్లో పనులు పూర్తి చేయటం జరిగిందని, రెండవ దశలో మరో 15వేల పాఠశాలల్లో ఆధునీకరణ పనులు వేగంగా జరుగుతున్నాయని, మూడో దశ పనులు త్వరలో ప్రారంభిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు.

మొదటి దశ నాడు-నేడులో ఆధునీకరణ జరిగిన 15వేల పాఠశాలల్లో ప్రైమరీ స్కూల్క్ కు ఒక స్మార్ట్ టీవీ, హైస్కూల్స్ లో ప్రతి తరగతికి ఒక ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానల్స్ పూర్తి కంటెంట్ లోడ్ చేసి మరీ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 5,957 ఇంటరాక్టీవ్ ప్లాట్ ప్యానల్స్, 10,038 స్మార్ట్ టీవీలు ఏర్పాటు చేయటం జరిగిందని వివరించారు. ఈ ఏడాది జూలై నాటికి నూరు శాతం లక్ష్యంను చేరుకుంటామని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇంత వేగంగా డిజిటల్ విద్య దిశగా అడుగులు వేయలేదన్నారు. ఈ ఏడాది డిసెంబర్ లో 8వ తరగతి విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్ లు అందించనున్నట్లు చెప్పారు.

అమ్మఒడి(Amma Vodi) పథకంలో భాగంగా ఈ నెల 28న విద్యార్థుల తల్లుల ఖాతాల్లో అమ్మఒడి నగదును జమ చేయనున్నట్లు మంత్రి బొత్స సత్యానారాయణ తెలిపారు. ఈ నెల 12 నుంచి ఆయా సచివాలాయాల్లో అమ్మఒడి పథకం అర్హుల లిస్ట్ ను నోటీస్ బోర్టులో ఉంచుతామని అభ్యంతరాలు ఉంటే ఈ నెల 22లోపు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 80వేల మంది ఉపాధ్యాయలను బదిలీ చేయనున్నమాని తెలిపారు. బదిలీల్లో పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నట్లు,అక్రమాలకు పాల్పడినట్లు తెలిస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. ఈ ఏడాది విద్యాకానుకలో విద్యార్థుల యూనిఫాం కుట్టుకూలి రూ. 10లు పెంచి రూ. 45 ఇస్తున్నామని మంత్రి తెలిపారు.

పదవ తరగతి, ఇంటర్మీడియట్ ఫెయిలైన విద్యార్థులకు మరో అవకాశంగా రెగ్యూలర్ గా మరో ఏడాది చదివే అవకాశం రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రెగ్యూలర్ విద్యార్థులకు అందించినట్లే వీరికి కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్నీ వర్తిస్తాయని వివరించారు.

Updated On 8 Jun 2023 8:44 PM GMT
Yagnik

Yagnik

Next Story