ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (APSSDC) కుంభకోణం కేసు ముగిసిన అధ్యాయమని తెలుగుదేశంపార్టీ భావిస్తూ వచ్చింది

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (APSSDC) కుంభకోణం కేసు ముగిసిన అధ్యాయమని తెలుగుదేశంపార్టీ భావిస్తూ వచ్చింది. ఎన్డీయే(NDA) సర్కారు తమను ఏమీ చేయలేదన్న భరోసాతో చంద్రబాబునాయుడు(Chandrababu Naidu) కూడా ఉన్నారు. కాకపోతే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ చేసిన ఓ ట్వీట్‌తో టీడీపీ(TDP) ఉలిక్కిపడింది. అలాచ్‌మెంట్‌కు సంబంధించిన ఆ ట్వీట్‌ భయాన్ని కూడా కల్పించింది. ఆంధ్రప్రదేశ్‌ స్కిల్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌- సీమెన్స్‌ ప్రాజెక్టులో నిధుల దుర్వినియోగానికి సంబంధించి 23.54 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను అటాచ్‌ చేసినట్టు ఈడీ ట్వీట్‌ చేసింది. దీంతో టీడీపీలో కలవరం మొదలయ్యింది. చంద్రబాబు అరెస్ట్ అయ్యింది ఈ కేసులోనే! 52 రోజుల పాటు రాజమండ్రి జైలులో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. చంద్ర‌బాబు వ‌ర్గీయుల‌కు స‌హ‌క‌రించిన షెల్ కంపెనీ డిజైన్ టెక్ ఎండీ వికాస్ వినాయ‌క్ క‌న్విల్క‌ర్‌, సీమెన్స్ కంపెనీ అప్ప‌టి ఎండీ సుమ‌న్ బోస్‌కు చెందిన వివిధ ప్రాంతాల్లోని రూ.23.54 కోట్ల విలువైన స్థిర‌, చ‌రాస్తుల‌ను ఈడీ అటాచ్ చేసింది. ఇంతకు ముందు ఇదే కేసులో డిజైన్ టెక్‌కు చెందిన రూ.31.20 కోట్ల విలువైన ఆస్తుల‌ను ఈడీ అటాచ్ చేసింది. అంటే మొత్తం 54.74 కోట్ల రూపాయల విలువైన ఆస్తుల‌ను అటాచ్ చేసిందన్నమాట! ఈడీ చేసిన ఆ చిన్న ట్వీట్‌ ఏపీ రాజకీయాలలో ప్రకంపనాలు రేపుతోంది. చంద్రబాబు అరెస్ట్‌ అయిన స్కిల్ కేసు కావడమే అందుకు కారణం. చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారనడానికి ఈ అటాచ్‌లే రుజువు అని వైసీపీ(YCP) నాయకులు అంటున్నారు. చంద్ర‌బాబుకు ఏ మాత్రం సంబంధం లేద‌ని ఈడీ అధికారులు చెప్పార‌ని ఎప్పటిలాగే టీడీపీ అనుకూల మీడియా ప్ర‌చారం చేస్తోంది.

ehatv

ehatv

Next Story