MLA Rapaka Vara Prasad : దొంగ ఓట్లతో గెలిచానన్న ఏపీ ఎమ్మెల్యే.. విచారణకు ఈసీ ఆదేశం
అత్యుత్సాహంతో చేసిన వ్యాఖ్యలతో చిక్కుల్లో పడ్డారు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్(Rapaka Vara Prasad). జనసేన నుంచి గెలిచిన ఆయన.. ఇటీవల మాట్లాడుతూ.. ఎన్నికల్లో తన విజయానికి దొంగ ఓట్లు దోహదపడ్డాయని చేసిన వ్యాఖ్యల వీడియో వైరల్ అయింది. దీంతో ఆయనపై వెంకటపతిరాజు అనే వ్యక్తి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాడు. దీంతో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సమగ్ర నివేదిక కోరారు. వారం రోజుల్లో నివేదిక సమర్పించాలని కోనసీమ కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు.

అభిమానుల ఆత్మీయ సమావేశంలో రాపాక వరప్రసాద్ మాట్లాడుతూ.. తమ ఊరు చింతలమోరికి ఓ దొంగ ఓట్ల బ్యాచ్ వచ్చేదని.. 15 నుంచి 20 మంది వరకు తలా 5 నుంచి 10 ఓట్లు వేసేవారని.. తన విజయంలో దొంగ ఓట్ల పాత్ర కూడా ఉందని రాపాక వరప్రసాద్ మాట్లాడిన మాటలు వీడియోలో చూడవచ్చు. రాజోలుకు చెందిన వెంకటపతిరాజు అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడినట్టు తన వ్యాఖ్యల ద్వారా అంగీకరించారని వెంకటపతిరాజు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదుపై ఎన్నికల ప్రధాన అధికారి.. సమగ్ర నివేదిక కోరారు. వారం రోజుల్లో నివేదిక అందించాలని కోనసీమ కలెక్టర్ ను ఆదేశించారు. జనసేన నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా గుర్తింపు పొందిన రాపాకకు.. 800 ఓట్ల మెజార్టీ రావడం విశేషం.