ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఆ రెండు జిల్లాలే కీలకం. అక్కడ ఏ పార్టీ మెజారిటీ సీట్లు సాధిస్తే.. అధికారం ఆ పార్టీదేనని గట్టి నమ్మకం. గత ఎన్నికలను పరిశీలిస్తే..ఈ విషయం నిజమేననిపిస్తుంది. రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ అధికారంలోకి రావడానికి కూడా ఆ రెండు జిల్లాలే కారణం. ఇంతకీ ఆ రెండు ఏవీ అనుకుంటున్నారా? ఆవేవోకాదు.. రాష్ట్రంలోనే అత్యధికంగా 33 స్థానాలు కలిగిన ఉభయగోదావరిజిల్లాలు (Godavari Districts). గత ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను వైసీపీ కైవసం చేసుకోగా..టీడీపీ, జనసేన కలిపి కేవలం ఏడు సీట్లకే పరిమితం అయ్యాయి. అయితే ఈసారి అవే ఫలితాలు రివర్స్ అవుతాయని అంటున్నారు ఆంధ్రా మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాసరావు(Chalasani Srinivasa Rao) (ఉండవల్లి (Undavalli) ఆయనకు చెప్పినదాని ప్రకారం)

రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలనేది ఉభయగోదావరి జిల్లాలే నిర్ణయిస్తాయి. గోదావరిజిల్లాలో మెజారిటీ సీట్లు ఎవరు సాధిస్తే..ఆ పార్టీదే అధికారం. అయితే ఈసారి.. 2019 ఎన్నిలకు పూర్తి రివర్స్ ఫలితాలు వస్తాయని ఉండవల్లి చెప్పారంటున్నారు ఏపీ మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాసరావు(Chalasani Srinivasa Rao) . ఉండవల్లి(Undavalli) చెప్పినదాని ప్రకారం పశ్చిమగోదావరి(West Godavari District) జిల్లాలో ఉన్న 14 సీట్లలో వైసీపీ రెండు స్థానాలు దక్కించుకోవడం కూడా గగనమేనంటున్నారు. ఇక తూర్పుగోదావరిజిల్లా(East Godavari District)లో ఉన్న 19 సీట్లలో 4 నాలుగు స్థానాలకే వైసీపీ పరిమితం అవుతుందని తేల్చేశారు. అంటే మొత్తం 34 సీట్లలో కేవలం 6 సీట్లకే వైసీపీ పరిమితం అవుతుందన్నమాట. అంటే 2019 ఎన్నికలకు పూర్తి విరుద్ధమైన ఫలితాలు వస్తాయని తేల్చేశారు చలసాని. ఒక్కమాటలో చెప్పాలంటే..అధికారం వైసీపీ నుంచి టీడీపీ(tdp) కూటమి చేతుల్లోకి పోతుందని చెప్పకనే చెప్పారని అర్థమవుతోంది.

2014 ఎన్నికల్లో టీడీపీ - జనసేన(tdp-Janasena) కూటమి పశ్చిమ గోదావరిజిల్లాలో క్లీన్ స్వీప్ చేసింది. తూర్పు గోదావరి జిల్లాలో 12 టీడీపీ, 5 వైసీపీ, 1 బీజేపీ, 1 స్వతంత్ర అభ్యర్ధి గెలుపొందారు. అదే 2019 ఎన్నికల్లో ఫలితాలు పూర్తి రివర్స్ అయ్యాయి. పశ్చిమ గోదావరిలో టీడీపీ కేవలం రెండు స్థానాలు పరిమితమైంది. తూర్పు గోదావరిలో టీడీపీ 4 స్థానాలు గెలుపొందగా, జనసేన ఒక్క స్థానానికే పరిమితమైంది. మిగిలిన 14 స్థానాలు వైసీపీ ఖాతాలో చేరాయి. టీడీపీకి 39.7 శాతం, వైసీపీకి 53.3 శాతం ఓట్లు దక్కాయి. జనసేన ఒకే సీటు గెలిచినా 14.84 శాతం ఓట్లు దక్కించుకుంది. పశ్చిమలో వైసీపీ 12 స్థానాల్లో గెలిచి 46.35 శాతం ఓటింగ్ దక్కించుకుంది. టీడీపీకి 36.30 ఓట్లు దక్కగా, జనసేనకు పశ్చిమలో 11.68 శాతం ఓట్లు పోలయ్యాయి. ఈ లెక్కల పరంగా టీడీపీ–జనసేన కూటమి అత్యధిక స్థానాలను గెలుచుకునే అవకాశం ఉందనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఈ నేపథ్యంలో 2014 ఎన్నికల తరహాలోనే గోదావరిజిల్లాల్లో మెజార్టీ సీట్లు సాధించే దిశగా కూటమి నేతలు కొత్త వ్యూహాలు రచిస్తున్నారు.

ఏపీలో ఎవరికి అధికారం దక్కాలన్నా గోదావరిజిల్లాల్లో మెజారిటీ సీట్లు సాధించుకోవడం అత్యంత కీలకం. వచ్చే ఎన్నికల్లో అధికారం సాధించడమే లక్ష్యంగా టీడీపీ-జనసేన కూటమి వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నాయి. పొత్తులు మొత్తం ఫలితాలను మార్చేసే అవకాశం ఉండటంతో వైసీపీ అధినేత, సీఎం జగన్ అలర్ట్ అయ్యారు. ఉభయగోదావరి జిల్లాల్లోని 34 స్థానాలపై పూర్తి ఫోకస్ పెట్టారు. ఇక్కడ ప్రధానంగా గెలుపోటములను నిర్ణయించేవి కాపు(kapu), ఎస్సీ(sc) సామాజిక వర్గాలే. ఎస్సీలు పూర్తిగా వైసీపీకి అనుకూలంగా ఉన్నారని ఆ పార్టీ నేతలు చెబున్నారు. అయితే కాపులు జనసేనవైపు ఏ మేరకు వెళ్తారన్నదే ఇక్కడ కీలమైన అంశం. ఈ క్రమంలోనే సామాజికవర్గాల వారీగా అసవరమైన చోట్ల బలమైన అభ్యర్థులను బరిలోకి దించేందుకు మార్పులు చేర్పులపై దృష్టి పెట్టారు సీఎం జగన్.

అధికార పార్టీకి దీటుగా టీడీపీ-జనసేన పార్టీలు కూడా ఉభయగోదావరిజిల్లాలపై గట్టి ఫోకస్ పెట్టాయి. ఇక గెలుపు గుర్రాలను బరిలోకి దించేందుకు రెండు పార్టీలు సైలెంట్ ఆపరేషన్ మొదలు పెట్టాయి. గతంలో గోదావరిజిల్లాల్లో ప్రజారాజ్యం(Prajarajyam)లో పని చేసిన వారితోసహా ఇతర పార్టీల్లోని బలమైన నేతలను పార్టీలోకి ఆహ్వానించేందుకు రహస్య మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం.

Updated On 26 Dec 2023 6:14 AM GMT
Ehatv

Ehatv

Next Story