రోజుల తరబడి నిరీక్షణ‌ త‌ర్వాత‌ వైఎస్సార్‌సీపీ ఎట్టకేలకు అనకాపల్లి లోక్‌సభ స్థానానికి అభ్యర్థిని ప్రకటించింది. గతంలో మాడుగుల అసెంబ్లీ స్థానానికి అభ్యర్థిగా ప్రకటించిన ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడును ఇప్పుడు అనకాపల్లి నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని కోరారు.

రోజుల తరబడి నిరీక్షణ‌ త‌ర్వాత‌ వైఎస్సార్‌సీపీ ఎట్టకేలకు అనకాపల్లి లోక్‌సభ స్థానానికి అభ్యర్థిని ప్రకటించింది. గతంలో మాడుగుల అసెంబ్లీ స్థానానికి అభ్యర్థిగా ప్రకటించిన ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడును ఇప్పుడు అనకాపల్లి నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని కోరారు. మార్చి 16న వైసీపీ 175 ఎమ్మెల్యే, 24 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల జాబితాను ప్ర‌క‌టించింది. అనకాపల్లి లోక్‌సభ స్థానానికి అభ్యర్థి పేరును వాయిదా వేసింది.

వెనుకబడిన వర్గానికి చెందిన అభ్యర్థిని ప్రతిపాదించాలని వైఎస్ జగన్ తొలుత భావించారు. అయితే గట్టి పోటీ కారణంగా సిట్టింగ్ ఎంపీ బీశెట్టి వెంకట సత్యవతిని పార్టీ పక్కన పెట్టింది. బీజేపీ అభ్యర్థిగా సీఎం రమేష్‌ పేరును ఖరారు చేయడం, వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త పీలా రామ కుమారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు నిరాసక్తత వ్యక్తం చేయడంతో.. గెలిచే అభ్యర్థిని రంగంలోకి దింపాల‌ని నిర్ణయించింది.

చివరకు ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడును అభ్యర్థిగా బరిలోకి దింపింది. ప్రస్తుతం మాడుగుల‌ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బూడి ముత్యాల నాయుడు కొప్పుల వెలమ సామాజికవర్గానికి చెందిన నేత‌. ఈ ప్రాంతంలో వెలమ సామాజికవర్గం ప్రాబల్యం ఎక్కువ‌ ఉందని.. అదే సామాజికవర్గానికి చెందిన సీఎం రమేష్‌ను కూట‌మి అభ్య‌ర్ధిగా బ‌రిలోకి దింప‌గా.. వైఎస్సార్‌సీపీ కూడా కొప్పుల వెలమ సామాజిక‌వ‌ర్గానికి చెందిన అభ్యర్థిని ఎంపిక చేసి వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించింది.

కాగా, మాడుగుల స్థానానికి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈర్లి అనురాధ ఎంపికయ్యారు. అనురాధ బూడి ముత్యాల నాయుడు కుమార్తె. అనకాపల్లి లోక్‌సభ స్థానానికి కొప్పుల వెలమ సామాజికవర్గం నుంచి బూడి ముత్యాల నాయుడును ఎంపిక చేయడం వల్ల దాని పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల ఓటుబ్యాంకుపై సానుకూల ప్రభావం పడనుంది.

Updated On 26 March 2024 9:50 PM GMT
Yagnik

Yagnik

Next Story