దువ్వాడ శ్రీనుకు వాణి పెట్టిన డిమాండ్స్‌ ఇవే!

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌(YCP MLC Duvvada Srinivas) ఫ్యామిలీ ఎపిసోడ్‌కు కామాలే ఉంటున్నాయి కాని ఇంకా పుల్‌స్టాప్‌ ఇంకా పడలేదు. వ్యవహారాన్ని సామరస్యంగా ముగించాలనే ఉద్దేశంతో సెటిల్మెంట్‌కు తెర తీశారు. ఇందులో భాగంగా దువ్వాడ భార్య వాణి(Duvvada vani) అయిదు డిమాండ్లు పెట్టారు. వాణి పెట్టిన మొదటి డిమాండ్‌ స్థిరాస్తులన్నీ(assets registration) ఇద్దరు కూతుళ్ల పేరున రిజిస్టర్‌ చేయాలి. రెండో డిమాండ్‌ ఏమిటంటే కుటుంబసభ్యుల అనుమతి లేకుండా స్థిరాస్తులను అమ్మకూడదు. శ్రీనివాస్‌ తదనంతరం ఆస్తులు తన పిల్లలకే చెందాలన్నది వాణి మూడో డిమాండ్‌. శ్రీనివాస్‌ ఉంటున్న ఇంట్లోకి పిల్లలను అనుమతించాలన్నది నాలుగో డిమాండ్‌. అయిదో డిమాండ్‌ ఏమిటంటే ఎట్టిపరిస్థితుల్లోనూ దువ్వాడ తనకు విడాకులు(Divorce) ఇవ్వకూడదు. ఈ డిమాండ్లకు దువ్వాడ శ్రీనివాస్‌ రియాక్టయ్యారు. తండ్రిగా పిల్లలకు చేయాల్సిదంతా చేస్తానన్నారు. తన అనంతరం ఇల్లు పిల్లలకే ఉంటుందని చెప్పారు. విడాకుల విషయంపై స్పందిస్తూ ఇప్పటికే నోటీసులు పంపించానని అన్నారు. ఇంత దూరం వచ్చిన తర్వాత వాణితో కలిసి ఉండటం కుదరదని దువ్వాడ అన్నారు. మరి వాణి కండిషన్లపై మాధురి ఏమంటారో చూడాలి.

Eha Tv

Eha Tv

Next Story