Duvvada Vani 5 Conditions : దువ్వాడ ఎపిసోడ్‌కు ఈ రోజు ఎండ్‌కార్డు పడుతుందా?
దువ్వాడ ఎపిసోడ్‌కు ఈ రోజు ఎండ్‌కార్డు పడుతుందా?
వారం రోజుల నుంచి మీడియాలో ప్రధానవార్తగా మారిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్(YCP) ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్(Duvvada Srinivas) ఫ్యామిలీ స్టోరీ ఆల్‌మోస్టాల్ క్లయిమాక్స్‌కు వచ్చింది. త్వరలో ఎండ్ కార్డు పడవచ్చు. రోజుకో మలుపుతో ఆసక్తి రేకెత్తించిన దువ్వాడ ఎపిసోడ్‌లో ఇరు వర్గాల మధ్య చర్చలు మొదలయ్యాయి. సోమవారం సెటిల్మెంట్ చర్చలు జరిగాయి. తెగేదాక లాగడం ఎందుకన్న ఉద్దేశంతో కుటుంబ సభ్యులు, బంధువులు సీన్‌లోకి ఎంటరయ్యారు. దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి ఏం కోరుకుంటున్నారు? ఆమె డిమాండ్లు ఏమిటి? అన్నది ముందు తేల్చాలనుకున్నారు. ఇదే విషయాన్ని ఆమెకు చెబితే, కూతుళ్లు, తల్లిదండ్రులతో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఆ తర్వాత భర్త ఎదుట అయిదు డిమాండ్లు పెట్టారు. అయితే ఆ డిమాండ్లు ఏమిటన్నది మాత్రం తెలియడం లేదు. ఆస్తి పంపకాల టాపిక్ కూడా వచ్చింది. వాణి తరఫు బంధువులు మాత్రం పిల్లలను దృష్టిలో పెట్టుకుని విడాకులు వద్దని సలహా ఇచ్చారు. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు. ఇవాళ వాణి(Vani) పెట్టిన అయిదు డిమాండ్లపై దువ్వాడ శ్రీనివాస్ స్పందించే తీరును బట్టి ఎపిసోడ్ ముగుస్తుందా? కొనసాగుతుందా? అన్నది తేలుతుంది.