వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌(YCP) ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌(MLC Duvvada Srinivas) కుటుంబ కథా చిత్రం అనేక మలుపులతో ఆసక్తికరంగా సాగుతోంది.

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌(YCP) ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌(MLC Duvvada Srinivas) కుటుంబ కథా చిత్రం అనేక మలుపులతో ఆసక్తికరంగా సాగుతోంది. ఇవాళ కూడా దువ్వాడ శ్రీనివాస్‌ భార్య వాణి(Duvvada vani), ఇద్దరు కూతుళ్లు నిరసనకు దిగారు. దువ్వాడ క్యాంపు కార్యాలయం బయటే వాణి నిద్రపోయారు. న్యాయం జరిగే వరకు ఇక్కడ్నుంచి కదలేది లేదని వాణి స్పష్టం చేశారు. మరోవైపు ఆత్మహత్య(Suicide) చేసుకుందామనుకునే సెల్ఫ్‌ యాక్సిడెంట్‌ చేశానని మాధురి(Madhuri) చెబుతున్నారు. వాణి చేస్తున్న ఆరోపణలు తనను అమితంగా బాధించాయని మాధురి అన్నారు. ఈ క్రమంలోనే పోలీసులపై కూడా మాధురి ఆరోపణలు చేశారు. మెరుగైన చికిత్స కోసం ఆమెను ఆరిలోవలోని అపోలో హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ఆసుపత్రిలో పోలీసులు ఇబ్బంది పెట్టారని మాధురి ఆరోపించారు. బ్రీత్‌ అనలైజేషన్‌, బ్లడ్‌ శాంపిల్‌ తీయడంపై మాధురి అభ్యంతరం వ్యక్తం చేశారు. విలేకరుల సమక్షంలో చేయాలని కోరినా పోలీసులు అనుమతించలేదని ఆరోపించారు. వాణి చేసిన ఆరోపణలపై తన పిల్లలను స్కూల్లో, ట్యూషన్‌లో అందరూ అడుగుతన్నారని మాధురి చెప్పారు. అందుకే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా అని అన్నారు. ఆడపిల్లలకు కష్టం వస్తే అండగా ఉంటానన్న డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ వెంటనే స్పందించాలని మాధురిలో అంటోంది.

Eha Tv

Eha Tv

Next Story