వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రాణాలు రక్షించుకునేందుకు ఏమి చేయడానికైనా సిద్ధమేనని

వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రాణాలు రక్షించుకునేందుకు ఏమి చేయడానికైనా సిద్ధమేనని టెక్కలి వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. అవసరమైతే మానవ బాంబుగా మారుతానని.. వైసీపీ కార్యకర్తలమంతా జగన్‌కు రక్షణగా ఉంటామని తేల్చి చెప్పారు. తాము తలచుకుంటే చంద్రబాబు, పవన్ రోడ్డెక్కే పరిస్థితి ఉండదని.. సీఎం జగన్ చెప్పడంతోనే తాము సంయమనం పాటిస్తున్నట్టు అన్నారు. జగన్‌‌పై విసిరిన రాయి నుదిటిపై తగిలింది కాబట్టి సరిపోయిందని, అదే కొంచెం ఎడమ వైపో, కుడివైపో తగిలి ఉంటే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. జగన్‌ను రక్షించుకోవడానికి తానే కాదని, తనలాంటి లక్షలాదిమంది ఆత్మాహుతి బాంబులం అవుతామని శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

మేమంతా సిద్ధం బస్సుయాత్రలో భాగంగా ఏప్రిల్ 13న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విజయవాడలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా సింగ్‌ నగర్‌లో జగన్ ర్యాలీ నిర్వహించారు. అయితే ఈ ర్యాలీలో జగన్‌కు రాయి తగిలి గాయమైంది.

Updated On 15 April 2024 11:21 PM GMT
Yagnik

Yagnik

Next Story