Drunken Youth Hulchul : మద్యం మత్తులో యువకుడు వీరంగం
ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం బసినికొండ పంచాయతీ హైవే రోడ్డు వై జంక్షన్ వద్ద ఆదివారం రాత్రి ఓ యువకుడు మద్యంమత్తులో హల్‌చల్ చేశాడు. నిమ్మనపల్లి ఎస్సై, ఎస్టీఎఫ్ సిబ్బంది వాహనాలు తనిఖీలు నిమిత్తం వెళ్తుండగా..

Drunken Youth Attacked the Police in Madanapalli
ఉమ్మడి చిత్తూరు జిల్లా(Chittoore District) మదనపల్లి(Madanapalle) మండలం బసినికొండ(Basinikonda) పంచాయతీ హైవే రోడ్డు వై జంక్షన్ వద్ద ఆదివారం రాత్రి ఓ యువకుడు మద్యంమత్తు(Drunken)లో హల్‌చల్ చేశాడు. నిమ్మనపల్లి(Nimmanpalli) ఎస్సై, ఎస్టీఎఫ్ సిబ్బంది వాహనాలు తనిఖీలు నిమిత్తం వెళ్తుండగా.. బసినికొండకు చెందిన జగదీష్(Jagadeesh), చందు(Chandu)లు ఇద్దరు మద్యం సేవించి మోటార్ సైకిల్ డ్యూక్(Duke Bike) పై వస్తూ స్పీడ్ బ్రేకర్ వద్ద అదుపు చేయలేక క్రిందపడి గాయాలయ్యాయి. అదే ప్రాంతంలో వాహనాలు తనిఖీలు నిర్వహిస్తున్నపోలీస్ సిబ్బంది గమనించి మద్యం మత్తులో గాయాలతో ఉన్న వారిని పోలీసుస్టేషన్(Police Station)కు తరలించేందుకు ప్రయత్నించగా.. పోలీస్ సిబ్బందిని నానా బూతులు మాట్లాడుతూ, బట్టలు విప్పేసి అసభ్యకరంగా ప్రవర్తించాడు ఓ యువకుడు. చికిత్స నిమిత్తం మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించగా.. హాస్పిటల్ లో డ్యూటీ లోఉన్న డాక్టర్, సిబ్బంది పై కూడా అసభ్యకరంగా మాట్లాడి దౌర్జన్యం చేశాడు.
