కర్నూలు నగరంలో సంచలనం సృష్టించిన జంట హత్యల కేసు మిస్టరీ వీడింది. నిందితులు నారపురం శ్రావణ్‌కుమార్‌, అతడి తండ్రి నారపురం వరప్రసాద్‌, తల్లి కృష్టవేణిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ నెల 14న శ్రావణ్‌కుమార్‌ భార్య రుక్మిణి, అత్త కొత్త రమాదేవిలను శ్రావణ్‌కుమార్‌, వరప్రసాద్‌లు దారుణంగా హత్య చేశారు.

కర్నూలు నగరంలో సంచలనం సృష్టించిన జంట హత్యల కేసు మిస్టరీ వీడింది. నిందితులు నారపురం శ్రావణ్‌కుమార్‌, అతడి తండ్రి నారపురం వరప్రసాద్‌, తల్లి కృష్టవేణిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ నెల 14న శ్రావణ్‌కుమార్‌ భార్య రుక్మిణి, అత్త కొత్త రమాదేవిలను శ్రావణ్‌కుమార్‌, వరప్రసాద్‌లు దారుణంగా హత్య చేశారు. మామ కొత్త వెంకటేశ్‌పై కూడా దాడికి దిగారు. తీవ్ర గాయలతో ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

నంద్యాలకు చెందిన వరప్రసాద్‌, కృష్ణవేణి దంపతులు 30 ఏళ్ల కిందట కర్నూలుకు వలస వచ్చారు. వీరి ఒక్కగానొక్క కుమారుడు శ్రావణ్‌ బీటెక్‌ చదివాడు. ప్రస్తుతం ఓ ప్రైవేటు బ్యాంకుకు చెందిన కాల్‌ సెంటర్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. శ్రావణ్‌కు ఈ మధ్యనే వనపర్తిలో స్థిరపడిన కొత్త వెంకటేశ్‌, రమాదేవి దంపతుల ఏకైక కూతురు రుక్మిణితో పెళ్లయింది. నిశ్చితార్థం ముగిసిన తర్వాత ఆమెకు శ్రావణ్‌ దురాలోచనతోనే ఓ సెల్‌ఫోన్‌ కొనిచ్చాడు. ఆ ఫోన్‌లో దొంగచాటుగా ఓ నిఘా యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసి పెట్టాడు. దాన్ని తన ఈ మెయిల్‌కు లింక్‌ చేసుకున్నాడు. రాఘవేంద్ర గౌడ్‌ అనే యువకుడితో రుక్మిణి తరచుగా మాట్లాడుతున్నట్టు శ్రావణ్‌కు సమాచారం వచ్చింది.. అప్పట్నుంచే ఆమెను అనుమానించడం మొదలు పెట్టాడు.. ఇంత తెలిసినా ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఫస్ట్‌ నైట్‌ నాడు శ్రావణ్‌ ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యాడు. ఆ రోజు రాత్రి భార్యకు దూరంగానే ఉన్నాడు. ఇది తెలిసి రెండు కుటుంబాలు గొడవ పడ్డాయి. అప్పుడే శ్రావణ్‌ తన భార్య సెల్‌ఫోన్‌లో ఉన్న నిఘా యాప్‌ గురించి, ఆమె ఎవరోనో తరచుగా మాట్లాడుతున్న విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపాడు. పెళ్లికి ముందు నుంచే రాఘవేంద్ర-రుక్మిణిలు ప్రేమించుకుంటున్నారని శ్రావణ్‌ అనడంతో రెండు కుటుంబాల మధ్య వైరం ముదిరింది.శ్రావణ్‌ ఆరోగ్య పరిస్థితిని గమనించిన అత్తింటి వారు అతడిని హైదరాబాద్‌లో చికిత్స చేయించారు. అయితే డాక్టర్లు అతడికి సున్తీ చేశారు. ఇది తెలుసుకున్న వరప్రసాద్‌ తన కొడుకు లైంగిక సామర్థ్యం తగ్గించడానికే సున్తీ చేయించారని అనుకున్నాడు. కోపం పట్టలేకపోయాడు. కుమారుడితో విషయం చెప్పి అత్తగారి కుటుంబంలోని అందరినీ చంపేద్దామని చెప్పాడు. నిజానికి మార్చి 10 తేదీనే మర్డర్‌కు ప్లాన్‌ చేశారు. ఎందుకో ఆ రోజు కుదరలేదు. ఆ తర్వాత శ్రావణ్‌కుమార్‌ వనపర్తి వెళ్లి మాయమాటలు చెప్పి భార్య, అత్తామామలను కర్నూలు తీసుకొచ్చాడు. అంతకు ముందే వరప్రసాద్‌ రెండు కత్తులు కొని ఇంట్లో పెట్టాడు. రుక్మిణిని ఇంట్లో ఉంచి ఆమె తల్లిదండ్రులను ఫస్ట్‌ ఫ్లోర్‌లో పంపారు. ఇంటి బయట కృష్ణవేణిని కాపలాగా పెట్టారు.

తర్వాత వరప్రసాద్, శ్రావణ్‌ కలిసి రుక్మిణి నోరు నొక్కారు. కత్తులతో పొడిచి చంపేశారు. ఆ వెంటనే ఫస్ట్‌ ఫ్లోర్‌కు వెళ్లిన వరప్రసాద్‌ అక్కడ రమాదేవిని పొడిచి చంపేశాడు. అడ్డుకోబోయిన వెంకటేశ్‌ను కూడా పలుసార్లు పొడిచాడు. ఎలాగోలా ఆయన ఇంటిబయటకు వచ్చి ప్రాణాలను కాపాడుకోగలిగాడు. రమాదేవి మాత్రం పారపోలేక ప్రాణాలు విడిచింది.

Updated On 17 March 2023 1:28 AM GMT
Ehatv

Ehatv

Next Story