తెలుగుదేశం(TDP)-జనసేన(Janasena) పార్టీలు పొత్తు పెట్టుకుని చాన్నాళ్లయ్యింది. చంద్రబాబు(Chandrababu) రాజమండ్రి జైలులో ఉన్నప్పుడు పవన్‌ కల్యాణ్‌(Pawan kalyan) బహిరంగంగా పొత్తును ప్రకటించారు. అప్పట్నుంచి రెండు పార్టీలు కలిసే పని చేస్తున్నాయి. ఇక బీజేపీ(BJP) కూటమిలో చేరాల్సి ఉంది. రేపో మాపో అది కూడా అయిపోతుంది. మూడు పార్టీలు కలిసి ఓ కూటమిగా ఏర్పడి జగన్‌పై(Jagan) పోరాటానికి దిగబోతున్నాయి.

తెలుగుదేశం(TDP)-జనసేన(Janasena) పార్టీలు పొత్తు పెట్టుకుని చాన్నాళ్లయ్యింది. చంద్రబాబు(Chandrababu) రాజమండ్రి జైలులో ఉన్నప్పుడు పవన్‌ కల్యాణ్‌(Pawan kalyan) బహిరంగంగా పొత్తును ప్రకటించారు. అప్పట్నుంచి రెండు పార్టీలు కలిసే పని చేస్తున్నాయి. ఇక బీజేపీ(BJP) కూటమిలో చేరాల్సి ఉంది. రేపో మాపో అది కూడా అయిపోతుంది. మూడు పార్టీలు కలిసి ఓ కూటమిగా ఏర్పడి జగన్‌పై(Jagan) పోరాటానికి దిగబోతున్నాయి. సీట్ల సర్దుబాటు ఇంకా జరగలేదు. అలాగే పొత్తులో భాగంగా ముఖ్యమంత్రి పదవిని కూడా పంచుకోవాలని కాపు నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. సీట్లను మాత్రమే పంచుకుంటే సరిపోదని, సీఎం పదవిని కూడా పంచుకోవాలని అంటున్నారు. కూటమి విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే రెండున్నరేళ్లు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండాలని, మిగతా రెండున్నరేళ్లు పవన్‌ కల్యాణ్‌కు ఆ పదవిని అప్పగించాలని కాపు నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. అలాగైతే మరి లోకేశ్‌బాబు(Nara Lokesh) మాటేమిటి? చినబాబు ఊరుకుంటారా? తనకు కూడా సీఎం పదవి కావాలని పట్టుబడితే పరిస్థితి ఏమిటి? శంఖారావం పేరుతో లోకేశ్‌ సభలను నిర్వహిస్తున్నారు కదా! ఈ క్రమంలో మొన్నపెందుర్తిలో జరిగిన సభలో కొందరు సీఎం లోకేశ్‌(CM Lokesh) అంటూ నినాదాలు చేశారు. సాధారణంగా లోకేశ్‌ సభలలో జై చంద్రబాబు అనే నినాదాలు వినిపిస్తాయి. ఇప్పుడు కొత్తగా సీఎం లోకేశ్‌ అనే నినాదాలు వినిపిస్తున్నాయి. అంటే లోకేశ్ కూడా సీఎం పదవి ఆశిస్తున్నారా? అన్న అనుమానం కలుగుతోంది. ఇప్పటికే చంద్రబాబు మూడు ముఖ్యమంత్రి అయ్యారు. ఈసారి టీడీపీ అధికారంలో వస్తే అయిదేళ్ల కాలంలో చివరలో అయినా లోకేశ్‌ను సీఎం చేయాలని ఆయన అనుకుంటున్నారట! కాపు నేతలు ఎన్ని డిమాండ్లు చేసినా పవన్‌కు ముఖ్యమంత్రి పదవిని అప్పగించడం చంద్రబాబుకు సుతరామూ ఇష్టం లేదు. పవన్‌ ముఖ్యమంత్రి అయితే తన పార్టీ క్యాడర్‌ బలహీనపడటం ఖాయమన్నది చంద్రబాబు భావన. అందుకే పూర్తిస్థాయి పదవీకాలంలో తానే ఉండాలని చంద్రబాబు గట్టిగా అభిప్రాయపడుతున్నారట! కూటమిలో ఉన్నప్పటికీ ఒకవేళ టీడీపీకి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగినన్నీ సీట్లు వస్తే మాత్రం చంద్రబాబు మిత్రపక్షాలను పక్కన పెట్టేసి సొంతంగా ప్రభుత్వాన్ని నడిపే అవకాశాలున్నాయి. అప్పుడు లోకేశ్‌కు పక్కగా సీఎం అయ్యే ఛాన్సు ఉంటుంది.

Updated On 19 Feb 2024 1:44 AM GMT
Ehatv

Ehatv

Next Story