మాజీ సీఎం జగన్‌(YS Jagan) తిరుమల పర్యటన సందర్భంగా రాజకీయవాతావరణం వేడెక్కింది.

మాజీ సీఎం జగన్‌(YS Jagan) తిరుమల పర్యటన సందర్భంగా రాజకీయవాతావరణం వేడెక్కింది. జగన్‌ శ్రీవారి దర్శనానికి(Tirumala darshan) వెళ్తుండడంతో పలువురు టీడీపీ నేతలు, హిందూ సంఘాలు డిక్లరేషన్‌ అంశా(Declaration)న్ని తెరపైకి తెచ్చారు. అయితే అన్యమతస్తులు తిరుమల వస్తే డిక్లరేషన్‌ తీసుకుంటారు. ఇప్పుడు జగన్‌ నుంచి కూడా డిక్లరేషన్‌ తీసుకునే యోచనలో టీటీడీ ఉన్నట్లు సమాచారం. జగన్‌ ఉండే గెస్ట్‌ హౌజ్‌కు వెళ్లి డిక్లరేషన్‌ ఫారాన్ని(declaration form) అందివ్వనున్నట్లు సమాచారం. డిక్లరేషన్ ఫారంపై సంతకం తీసుకున్న తర్వాతే ఆయనను దర్శనం చేసుకునేందుకు అనుమతి ఇవ్వనున్నారని తెలుస్తోంది. సంతకానికి జగన్ నిరాకరిస్తే దేవాదాయశాఖ చట్ట ప్రకారం ముందుకు వెళ్తామని అధికారులు చెప్తున్నట్లు సమాచారం.

డిక్లరేషన్‌ ఎప్పుడు తీసుకొచ్చారు

అన్యమతస్తులు శ్రీవారి దర్శనానికి వస్తే కచ్చితగా ఒక డిక్లరేషన్‌ ఇవ్వాలని ప్రభుత్వం అప్పట్లో ఒక జీవో తీసుకొచ్చింది. దేవాదాయశాఖ చట్టం 30/1987 ప్రకారం 1990లో అప్పటి ప్రభుత్వం ఓ జీవోను తీసుకొచ్చింది. ఈ జీవో ప్రకారం హిందువులు కాని ఇతర వ్యక్తులు లేదా ఇతర మతస్తులు శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించాలంటే డిక్లరేషన్‌ ఫారంపై సంతకం పెట్టాలన్న నిబంధన తీసుకొచ్చారు.

డిక్లరేషన్‌ ఫారంలో ఏముందంటే..

ఇతర మతానికి చెందిన వ్యక్తులు శ్రీవారి దర్శనానికి వస్తే 17వ కంపార్ట్‌మెంట్ దగ్గర సంతకం చేయాల్సి ఉంటుంది. 'నేను ఇతర మతానికి సంబంధించిన వ్యక్తినని.. కానీ నాకు శ్రీవేంకటేశ్వరస్వామిపై నమ్మకం, గౌరవం ఉందని.. తనను దర్శనానికి అనుమతించాలని' కోరుతూ వివరాలు చేర్చి సంతకం చేయాల్సి ఉంటుంది.

అయితే అనమతస్తుల్లో సామాన్య భక్తులు శ్రీవారి దర్శనానికి వచ్చినప్పపుడు 17వ కంపార్ట్‌మెంట్‌ దగ్గర డిక్లరేషన్‌పై సంతకం చేయాలి. వీవీఐపీలు, వీఐపీలు వస్తే అధికారులే వారు ఉంటున్న గెస్ట్‌హౌజ్ దగ్గరికి వెళ్లి సంతకాలు తీసుకుంటారు. జగన్‌ శుక్రవారం తిరుమల వెళ్తే గెస్ట్‌హౌస్‌ దగ్గరకు వెళ్లి టీటీడీ నిబంధనలు, దేవాదాయశాఖ చట్టంలోని అంశాలను ఆయనకు వివరించి డిక్లరేషన్‌పై సంతకం కోరనున్నట్లు తెలుస్తోంది. దీంతో వైఎస్ జగన్ తిరుమల పర్యటన ఆసక్తికరంగా మారింది. సోనియాగాంధీ, అబ్దుల్‌ కలాం శ్రీవారిని దర్శించుకున్న సందర్భంలో వారి గెస్ట్‌ హౌజ్‌ దగ్గరికి వెళ్లి డిక్లరేషన్‌ తీసుకున్నారు అధికారులు. జగన్‌ కూడా గతంలో అనేక సార్లు శ్రీవారిని దర్శించుకున్నారు. గత ఐదేళ్లలో ముఖ్యమంత్రి హోదాలో జగన్‌ శ్రీవారిని దర్శించుకున్నారు. కానీ అప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉండడంతో అధికారులు డిక్లరేషన్‌ కోరలేదు. ఇప్పుడు మాత్రం డిక్లరేషన్‌పై సంతకం చేసిన తర్వాతే దర్శనానికి అనుమతించాలని పార్టీలు హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు బీజేపీ నేత భానుప్రకాష్‌రెడ్డి ఒక అడుగు ముందుకు వేసి జగన్‌ హిందువులకు క్షమాపణ చెప్పిన తర్వాతే తిరుమల వెళ్లాలని డిమాండ్ చేస్తున్నారు.

Eha Tv

Eha Tv

Next Story