తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి (Sankranthi) పండగను ఘనంగా జరుపుకోవడమనేది మనందరికీ తెలిసిందే. తమిళనాడులో పొంగల్‌గా (Pongal) ఈ పండగను సెలబ్రేట్ చేసుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో భోగి (Bhogi), మకర సంక్రాంతి, కనుమ (Kanuma) అని మూడు రోజుల పాటు సంక్రాంతిని సెలబ్రేట్‌ చేసుకుంటారు.

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి (Sankranthi) పండగను ఘనంగా జరుపుకోవడమనేది మనందరికీ తెలిసిందే. తమిళనాడులో పొంగల్‌గా (Pongal) ఈ పండగను సెలబ్రేట్ చేసుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో భోగి (Bhogi), మకర సంక్రాంతి, కనుమ (Kanuma) అని మూడు రోజుల పాటు సంక్రాంతిని సెలబ్రేట్‌ చేసుకుంటారు. సూర్యుడు (Sun) మకరరాశిలో ప్రవేశించే రోజు కావడంతో మకర సంక్రాంతి పండగ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా భోగి మంటలు, గంగిరెద్దులు, పిండి వంటలు, హరిదాసు కీర్తనలు, రథం ముగ్గులు, కోడి పందేలు, కొన్ని చోట్ల ఎడ్ల బండ్ల ఊరేగింపులు, ఎడ్ల బండ్ల పోటీలు, చిన్నారులకు బోడలు పోయడంవంటి కార్యక్రమాలతో పండగను సంతోషంతో చేసుకుంటారు. ప్రతీ ఇంటి వాకిలిలో రంగురంగుల ముగ్గులు వేసి అలంకరిస్తారు. ఆ తర్వాత ఈ ముగ్గుల మధ్యలో గొబ్బెమ్మలు పేరుస్తుంటారు. కానీ సంక్రాంతి రోజునే ముగ్గుల మధ్యలో గొబ్బెమ్మలు ఎందుకు పెడతారనేది మనలో చాలా మందికి తెలియదు. కొందరికి తెలిసినా చెప్పకపోవడంతో ఈ తరం యువతకు దాని

సంక్రాంతి పండగ సందర్భంగా ఇంటి ముందు ముగ్గులు (Rangoli) వేసి రంగులతో అందగా అలంకరించి వాటి మధ్యలో గొబ్బెమ్మలు (Gobbemma) పెట్టడం సాంప్రదాయంగా వస్తోంది. ముగ్గు మధ్యలో గొబ్బెమ్మలను పేర్చి వాటిని పసుపు, కుంకుమ పూలు, వాటి చుట్టూ రేగి పళ్లు, చిరుధాన్యాలతో అలంకరిస్తారు. మన సంప్రదాయంలో గొబ్బెమ్మలకు ప్రత్యేక స్థానం ఉంది. గొబ్బెమ్మను గౌరీమాతగా (Gowry Matha) కొలుస్తారు. మరికొన్ని చోట్ల గొబ్బెమ్మను కాత్యాయినీ దేవిగా (Kathyani Devi) పూజిస్తారు. పండగరోజు అలా చేస్తే భర్త బతికే ఉన్న పుణ్య స్త్రీతో సమానమాట. అయితే పెద్ద గొబ్బెమ్మను గోదా దేవిగా పూజిస్తారు. ముగ్గులు, గొబ్బెమ్మలు అంటే లక్ష్మీ దేవికి (Lakshmi Devi) కూడా చాలా ఇష్టమని చెప్తున్నారు. సంక్రాంతి పండగ నాడు ముగ్గుల మధ్యలో గొబ్బెమ్మలను పెడితే ఇంట్లో లక్ష్మీ దేవిని ఆహ్వానించినట్లని మన పూర్వీకులు వివరిస్తున్నారు.

Updated On 8 Jan 2024 12:54 AM GMT
Ehatv

Ehatv

Next Story