తిరుమల(Tirumala) శ్రీవారి దర్శనానికి కాలినడకన వెళ్లే భక్తులకు దివ్యదర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు. ఈ టోకెన్లు భూదేవి కాంప్లెక్స్ వద్ద జారీ చేస్తున్నారు. అయితే భక్తులు తమ ఆధార్ కార్డు చూపి టోకెన్లు పొందొచ్చు. భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు.

అయితే భక్తులకు దివ్య దర్శనం టోకెన్ల జారీలో టీటీడీ కొన్ని మార్పులు చేసింది. అలిపిరి కాలిబాట మార్గంలో వెళ్లాలనుకునే భక్తులకు దివ్య దర్శనం టోకెన్లు భూదేవి కాంప్లెక్స్ వద్ద మాత్రమే జారీ చేయబడతాయని టీటీడీ( TTD) తెలిపింది. అయితే టోకెన్లు పొందిన తర్వాత, వారు అలిపిరి ఫుట్‌పాత్(Alipiri footpath) 2083వ మెట్టు వద్ద టోకెన్‌లను స్కాన్ చేయాల్సి ఉంటుందని, లేని పక్షంలో వారికి స్లాటెడ్ దర్శనం అందించబడదని స్పష్టం చేసింది. ఇంతకు ముందు తిరుమల((Tirumala)కు వెళ్లే అలిపిరి కాలిబాటలోని గాలిగోపురం వద్ద డీడీ టోకెన్లు జారీ చేసేవారు. ప్రస్తుతం దివ్య దర్శనం టోకెన్ల జారీ ప్రక్రియను భూదేవి కాంప్లెక్స్‌కు మార్చారు. భూదేవి సముదాయంలో దివ్య దర్శన టోకెన్లు(tokens) పొందిన భక్తులు అలిపిరి కాలిబాట మార్గం ద్వారా తిరుమలకు చేరుకుంటేనే దర్శనానికి అర్హులు అవుతారు.

కాగా, శ్రీవారి మెట్టు కాలినడకన వెళ్లే భక్తులకు యథావిధిగా ఆ మార్గంలోని 1240వ మెట్టు వద్ద టోకెన్లు జారీ చేస్తున్నట్లు టీటీడీ( TTD)తెలిపింది. రోడ్డు మార్గంలో తిరుమలకు చేరుకునే భక్తులకు తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, గోవిందరాజ స్వామి చౌల్ట్రీల వద్ద స్లాటెడ్ సర్వ దర్శనం టోకెన్లను జారీ చేస్తారు. భక్తులు ఈ సౌకర్యాలు, మార్గదర్శకాలను గమనించాలని టీటీడీ అధికారులు సూచించారు.

Updated On 17 April 2023 1:36 AM GMT
madhuri p

madhuri p

Next Story