జూన్ 4వ తేదీన లోక్‌సభ(Lok Sabha), అసెంబ్లీ(Assembly) నియోజకవర్గాలకు సంబంధించి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(Acharya Nagarjuna University)లో ఓట్ల లెక్కింపు(votes counting) జరుగుతుందని పోటీలో ఉన్న అభ్యర్థులు ఈ నెల 30వ తేదీలోపు తమ ఏజెంట్ల వివరాలను అందజేయాలని జిల్లా కలెక్టర్ ఎం .వేణుగోపాల్ రెడ్డి(District Collector Venugopal Reddy)  తెలిపారు.

జూన్ 4వ తేదీన లోక్‌సభ(Lok Sabha), అసెంబ్లీ(Assembly) నియోజకవర్గాలకు సంబంధించి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(Acharya Nagarjuna University)లో ఓట్ల లెక్కింపు(votes counting) జరుగుతుందని పోటీలో ఉన్న అభ్యర్థులు ఈ నెల 30వ తేదీలోపు తమ ఏజెంట్ల వివరాలను అందజేయాలని జిల్లా కలెక్టర్ ఎం .వేణుగోపాల్ రెడ్డి(District Collector Venugopal Reddy) తెలిపారు. గుంటూరు పార్లమెంట్ కౌంటింగ్ కు సంబంధించి ఏఎన్ యూలో అసెంబ్లీ కౌంటింగ్ హాలులోనే ఏర్పాటు చేశామన్నారు. పోస్టల్ బ్యాలెట్, ఈటీపీబీఎస్ ఓట్ల లెక్కింపునకు సెంట్రల్ బ్లాక్ లో 14 టేబుల్స్ ఏర్పాటు చేశామన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులు టేబుల్ కు ఒకరి చొప్పున ఏజెంట్లను నియమించుకోవాలని తెలిపారు. వివరాలు అందిస్తే గుర్తింపు కార్డు అందజేస్తామన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థితోపాటు ఒక ముఖ్య ఏజెంట్ నియోజకవర్గాల్లో జరుగుతున్న పార్లమెంట్ ఓట్ల కౌంటింగ్ ను పరిశీలించుకునే అవకాశముంటుందని చెప్పారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 4వ తేదీ ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభిస్తామన్నారు. పార్లమెంట్, అసెంబ్లీ కౌంటింగ్ పూర్తికాగానే ఆర్వో టేబుల్స్ వద్ద ప్రదర్శిస్తారన్నారు. గుర్తింపు కార్డు ఉన్న వారిని మాత్రమే అనుమతిస్తామన్నారు. సెల్ఫోన్ నిషేధమని, పెన్ను, పేపరు తీసుకు రావచ్చని తెలిపారు. కౌంటింగ్ హాలుకు 100 మీటర్ల దూరంలోనే వాహనాలను అనుమతి స్తామన్నారు.

Updated On 25 May 2024 1:35 AM GMT
Ehatv

Ehatv

Next Story