Rains In Andhra Pradesh : ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు
ఆంధ్రప్రదేశ్‌లోని(andhra Pardesh) పలు జిల్లాల్లో ప్రస్తుతం భారీ వర్షాలు(Heavy Rains) కురుస్తున్నాయి. మరో మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో కురుస్తున్న వర్షాలపై ప్రజలను అప్రమత్తం చేస్తూ ఏపీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఆర్గనైజేషన్ వాతావరణ బులెటిన్‌ను విడుదల చేసింది.

నేడు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతామరాజు, ఏలూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
31వ తేదీన అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.
ఈ నెల 1వ తేదీన విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఎన్టీఆర్, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య తదితర జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. కాగా, నంద్యాలలో 4.3, కర్నూలులో 0.9, నర్సాపూర్‌లో 0.6 మి.మీ వర్షం కురిసింది. వర్షపాతం ఉష్ణోగ్రతలలో గణనీయమైన తగ్గుదలకు దారితీసింది.