Jayaram : గుంతకల్లు టీడీపీ నేతలు సర్దుకుపోతారా? సాధిస్తారా?
తెలుగుదేశం పార్టీ(TDP) మరో జాబితాను విడుదల చేసింది. తొమ్మిది మంది ఎమ్మెల్యే అభ్యర్థులను, నలుగురు లోక్‌సభ అభ్యర్థులను ప్రకటించింది. ఉమ్మడి అనంతపురం(Aanthapur) జిల్లా గుంతకల్లు నియోజకవర్గం టికెట్ గుమ్మనూరు జయరామ్‌కు దక్కింది. గుంతకల్లు(Gunthakallu) టికెట్ జయరామ్‌కు ఇస్తారనే సంకేతాలు వెలువడినప్పట్నుంచే స్థానిక టీడీపీ నేతలు తమ అసంతృప్తిని వెలగక్కడం మొదలుపెట్టారు. జయరామ్ అభ్యర్థిత్వానికి వ్యతిరేకంగా గుంతకల్లులో టీపడీ నేతలు భారీగా నిరసన ప్రదర్శనలను నిర్వహించారు.
తెలుగుదేశం పార్టీ(TDP) మరో జాబితాను విడుదల చేసింది. తొమ్మిది మంది ఎమ్మెల్యే అభ్యర్థులను, నలుగురు లోక్‌సభ అభ్యర్థులను ప్రకటించింది. ఉమ్మడి అనంతపురం(Aanthapur) జిల్లా గుంతకల్లు నియోజకవర్గం టికెట్ గుమ్మనూరు జయరామ్‌కు దక్కింది. గుంతకల్లు(Gunthakallu) టికెట్ జయరామ్‌కు ఇస్తారనే సంకేతాలు వెలువడినప్పట్నుంచే స్థానిక టీడీపీ నేతలు తమ అసంతృప్తిని వెలగక్కడం మొదలుపెట్టారు. జయరామ్ అభ్యర్థిత్వానికి వ్యతిరేకంగా గుంతకల్లులో టీపడీ నేతలు భారీగా నిరసన ప్రదర్శనలను నిర్వహించారు. చంద్రబాబు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా జయరామ్‌కే టికెట్ ఇచ్చారు. స్థానిక నేతలకు జయరామ్(Jayaram) అంటే ఎందుకు కోపమంటే.. ఆయన మొన్నటి వరకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి(Jagan) క్యాబినెట్‌లో మంత్రిగా పని చేయడమే! ఉమ్మడి కర్నూలు జిల్లా ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న జయరామ్‌కు తిరిగి అదే స్థానాన్ని జగన్ కేటాయించలేదు. జయరామ్‌పై ప్రజలలో వ్యతిరేకత ఉందని తెలుసుకున్న జగన్ ఆయనకు కర్నూలు ఎంపీ స్థానాన్ని ఇవ్వాలనుకున్నారు. కర్నూలు ఎంపీ అభ్యర్థిగా జయరామ్ పేరును ప్రకటించింది కూడా! అయితే ఎంపీగా పోటీ చేయడానికి జయరామ్ ఇష్టపడలేదు. మార్చడానికి జగన్ కూడా ఇష్టపడలేదు. ఇలాగైతే లాభం లేదనుకున్న జయరామ్ కర్నాటక కాంగ్రెస్ నేతల నుంచి చంద్రబాబుకు సిఫార్స్ చేయించుకున్నారు. అలా తెలుగుదేశం పార్టీలో చేరారు. గుంతకల్లు టికెట్ అడిగారు. చంద్రబాబు కూడా సుముఖంగా ఉన్నారని తెలుసుకున్న గుంతకల్లు టీడీపీ నేతలు ఆందోళన చెందారు. తమ అభిప్రాయాలను కాదని జయరామ్‌కే టికెట్ ఇస్తే మాత్రం ఓడించి తీరుతామని హెచ్చరించారు. అరాచక నేత, పేకాట, లిక్కర్ డాన్ గుమ్మనూరు జయరామ్ గో బ్యాక్ అంటూ నిరసన కార్యక్రమాలను చేపట్టారు. టీడీపీ మహిళా కార్యకర్తలైతే ఇంకాస్త ఎక్కువ చేశారు. ఇప్పుడు జయరామ్‌కు టికెట్ ఇవ్వడంతో టీడీపీ నేతలు ఎలా రియాక్టవుతారో చూడాలి. సర్దుకుపోతారా? సాధిస్తారా?