Director Trivikram : టీటీడీ పాలకమండలిలో త్రివిక్రమ్‌కు చోటు!
తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్(TTD Chairman) పదవిని ఎవరికి ఇవ్వాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) తేల్చుకోలేకపోతున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్(TTD Chairman) పదవిని ఎవరికి ఇవ్వాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) తేల్చుకోలేకపోతున్నారు. చాలా మంది పైరవీలు చేసుకుంటున్నారు. టీవీ 5 ఛానెల్ అధినేత బీఆర్ నాయుడు(BR naidu) పేరు అయితే బలంగా వినిపిస్తోంది. అయితే ఈయనకు ఈ పదవిని ఇవ్వడం మరో మీడియా అధినేతకు ఇష్టం లేదన! అందుకే ఆయన ఎన్.వి.రమణ(NV ramana) పేరును ముందుకు తీసుకొచ్చారట! అది అలా ఉంచితే పాలక మండలిలో చోటు కోసం చాలా మంది ప్రయత్నిస్తున్నారు. దర్శక రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు కూడా వినిపిస్తోంది. ఆయన ఈ మధ్య తరచూ తిరుమలకు వెళుతున్నారు. ప్రాయశ్చిత్త దీక్ష విరమణ కోసం పవన్ కల్యాణ్(Pawan kalyan) తిరుమలకు వెళ్లారు కదా! అదే సమయంలో త్రివిక్రమ్ కూడా తిరుమలకు వెళ్లారు. త్రివిక్రమ్-పవన్ మధ్య గట్టి ఫ్రెండ్‌షిప్ ఉంది. తివిక్రమ్‌ను(Tri vikram) పవన్ బాగా నమ్ముతారు. ఆ మాటకొస్తే త్రివిక్రమ్‌ను నమ్మినంతగా పవన్ మరెవ్వరినీ నమ్మరు. పవన్ ద్వారా టీటీడీ పాలకమండలిలో చోటు సంపాదించుకోవాలనుకుంటున్నారు త్రివిక్రమ్. దర్శకుడు రాఘవేంద్రరావు, నిర్మాత అశ్వనీదత్ కూడా టీటీడీ పాలకమండలిలో చోటు కోసం తహతహలాడిపోతున్నారు. ఒకప్పటి హీరో, నిర్మాత మురళీమోహన్ పేరు కూడా వినిపిస్తోంది, అయితే జనసేన కోటా నుంచి త్రివిక్రమ్‌కే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం పవన్‌కు త్రివిక్రమే అండాదండా. పవన్‌తో ఎవరు సినిమా తీయాలి? స్క్రిప్ట్ ఎలా ఉండాలి? హీరోయిన్‌గా ఎవరు నటించాలి? వంటి విషయాలను త్రివిక్రమే దగ్గరుండి చూసుకుంటున్నారట! టీటీడీ బోర్డు మెంబర్‌షిప్ కావాలని త్రివిక్రమ్ అడగాలే కానీ పవన్ ఇవ్వకుండా ఉంటారా? అయితే త్రివిక్రమ్‌కు ఇంట్రెస్ట్ ఉందా లేదా అన్నది మాత్రం తెలియదు. ఫ్రీక్వెంట్‌గా ఆయన తిరుమలకు వెళుతుండటం చూసి చాలా మంది అలా అనుకుంటున్నారు. కాకపోతే త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు ఏదో ఒక పదవి దొరకడం మాత్రం పక్కా!