టీడీపీ(TDP) అధినేత అరెస్ట్‌పై ప్రముఖ నటుడు, దర్శకుడు రవిబాబు(Ravi Babu) స్పందించారు. ఈ మేర‌కు ఆయ‌న ఓ వీడియో విడుద‌ల చేశారు. వీడియోలో రవిబాబు మాట్లాడుతూ.. ‘జీవితంలో ఏదీ శాశ్వతం కాదండి. సినిమా వాళ్ల గ్లామర్ కానీ, రాజకీయ నాయకుల పవర్ కానీ అస్సలు శాశ్వతం కాదు. అలాగే చంద్రబాబు నాయుడుకి వచ్చిన కష్టాలు కూడా శాశ్వతం కాదు.

టీడీపీ(TDP) అధినేత అరెస్ట్‌పై ప్రముఖ నటుడు, దర్శకుడు రవిబాబు(Ravi Babu) స్పందించారు. ఈ మేర‌కు ఆయ‌న ఓ వీడియో విడుద‌ల చేశారు. వీడియోలో రవిబాబు మాట్లాడుతూ.. ‘జీవితంలో ఏదీ శాశ్వతం కాదండి. సినిమా వాళ్ల గ్లామర్ కానీ, రాజకీయ నాయకుల పవర్ కానీ అస్సలు శాశ్వతం కాదు. అలాగే చంద్రబాబు నాయుడుకి వచ్చిన కష్టాలు కూడా శాశ్వతం కాదు. ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబును ఎలా అరెస్ట్ చేశారో తనకు అర్థంకావడం లేదన్నారు.

ఎన్టీఆర్‌(NTR), చంద్రబాబు నాయుడు(Chandrababu) ఫ్యామిలీలు మా కుటుంబానికి బాగా ఆప్తులు.. కావాల్సినవాళ్లు. చంద్రబాబు నాయుడు ఏదైనా పని చేసే ముందు 100 కోణాల్లో చూసి అందరినీ సంప్రదించి ఎవ్వరికీ ఇబ్బంది కలగకుండా నిర్ణయం తీసుకుంటారు. ఆయనకి భూమి మీద ఇవాలే ఆఖరి రోజు అని తెలిసినా కూడా కూర్చొని వచ్చే 50 సంవత్సరాలకు సామాజిక అభివృద్ధి గురించి ప్లాన్లు వేస్తారు. ఆయన డబ్బు కోసం కక్కుర్తిపడే మనిషి కాదు. మరి అలాంటి వ్యక్తిని సరైన ఆధారాలు కూడా లేకుండా జైల్లో పెట్టి ఎందుకు వేధిస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. రాజకీయాల్లో ఎత్తులు పైఎత్తులు సహజం. కానీ, 73 ఏళ్ల వయసున్న వ్యక్తిని జైల్లో పెట్టి హింసించడం..

ఏ ఎత్తో పైఎత్తో అయితే మాత్రం అది చాలా దారుణమండి. అశాశ్వతమైన అధికారం ఉన్నవాళ్లకు నా వినయపూర్వక అభ్యర్థ ఏంటంటే.. మీరు ఏ పవర్‌ను అయితే వాడి ఆయన్ని జైల్లో పెట్టారో దయచేసి అదే పవర్‌ను ఉపయోగించి ఆయన్ని వదిలేయండి. మీరు చిటికేస్తే అది జరిగిపోతుందని అందరికీ తెలుసు. ఆయన్ని బయట ఉంచి మీ ఇష్టమొచ్చినట్టు ఇన్వెస్టిగేషన్ చేసుకోండి. ఆయన కచ్చితంగా ఈ దేశాన్ని వదిలేసి అయితే పారిపోడండి. ఆలోచించండి.. చరిత్ర మిమ్మల్ని ఎలా గుర్తుంచుకోవాలని అనుకుంటున్నారు. కక్షతో రగిలిపోయే కసాయివాళ్లలాగనా.. లేకపోతే జాలి మనసు, విలువలు ఉన్న మంచి నాయకుడిలాగనా.. దయచేసి చంద్రబాబు నాయుడుని వదిలిపెట్టేయండి. నాలాగా ఎంతో మంది మీ పట్ల కృతజ్ఞతతో ఉంటారు’ అని వెల్లడించారు. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. టీడీపీ మ‌ద్ద‌తుదారులు ర‌విబాబుకు అనుకూలంగా.. వైసీపీ మ‌ద్ద‌తుదారులు వ్య‌తిరేకంగా రియాక్ట్ అవుతున్నారు.

Updated On 30 Sep 2023 6:29 AM GMT
Ehatv

Ehatv

Next Story