ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రులలో ఖాళీగా ఉన్న సివిల్ అసిస్టెంట్ సర్జన్-స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ మెంబర్, సెక్రటరీ ఎం. శ్రీనివాసరావు ప్రకటన లో తెలిపారు.
ప్రస్తుతం ఖాళీగా ఉన్న 331 పోస్టులను జూలై 5, 7, 10 తేదీలలో ఏపీవీవీపీ కమీషనర్ కార్యాలయము, గొల్లపూడి, విజయవాడలో వాక్ ఇన్ రిక్రూట్మెంట్ పద్ధతిలో భర్తీ చేస్తామని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్(Andhra Pradesh Vaidya Vidhana Parishad) ఆసుపత్రుల(Hospitals)లో ఖాళీగా ఉన్న సివిల్ అసిస్టెంట్ సర్జన్(Civil Assistant Surgeon)-స్పెషలిస్ట్(Specialist) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్(Andhra Pradesh Medical Services Recruitment Board) సెక్రటరీ ఎం. శ్రీనివాసరావు(M Srinivasa Rao) ప్రకటన లో తెలిపారు.

ప్రస్తుతం ఖాళీగా ఉన్న 331 పోస్టులను జూలై 5, 7, 10 తేదీలలో ఏపీవీవీపీ(APVVP) కమీషనర్ కార్యాలయము, గొల్లపూడి(Gollpudi), విజయవాడలో వాక్ ఇన్ రిక్రూట్మెంట్(Walk in Recruitment) పద్ధతిలో భర్తీ చేస్తామని తెలిపారు. ఈ ఖాళీల సంఖ్య పెరిగే అవకాశం వుందని సంబంధిత పూర్తి నోటిఫికేషన్(Notification), దరఖాస్తు నమూనాను cfw.ap.nic.in, hmfw.ap.gov.in వెబ్ సైట్లలో ఉంచామనీ పేర్కొన్నారు.

"ఇప్పుడు నిర్వహించబోతున్న నియామకాలలో కాంట్రాక్టు పద్ధతి నియామకాలకు స్థానికత, రోస్టర్ విధానం నుండి సడలింపు ఇవ్వబడుతుంది. రెగ్యులర్ ప్రాతిపదికన టైం స్కేల్ ఆఫ్ పే ఇతర అలవెన్సులు, గిరిజన ప్రాంతంలో 50 శాతం అదనపు జీతం ఇవ్వబడుతుంది. కాంట్రాక్టు విధానం లో గిరిజన ప్రాంతంలో రెండున్నర లక్షల రూపాయలు, గ్రామీణ ప్రాంతంలో రెండు లక్షల రూపాయలు నెలవారీ జీతం ఇవ్వబడుతుంది. కావున అర్హులైన అభ్యర్థులందరూ వాక్ ఇన్ రిక్రూట్మెంట్ లో పాల్గొనవచ్చని ఆయన తెలిపారు.

Updated On 28 Jun 2023 10:49 PM GMT
Yagnik

Yagnik

Next Story