Chandrababu Weight : జైలుకు వచ్చాక చంద్రబాబు బరువు పెరిగారు
చంద్రబాబు(Chandrababu) సతీమణి భువనేశ్వరి(Nara Bhuvaneshwari) తన భర్త ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబుకు ఎమర్జెన్సీ వైద్యాన్ని అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. జైలులో చంద్రబాబుకు సకాలంలో వైద్యం అందడం లేదని.. ఇప్పటికే ఆయన ఐదు కిలోలు బరువు తగ్గారని భువనేశ్వరి ట్వీట్ చేశారు.

Chandrababu Weight

ట్వీట్‌లో.. నా భర్త జైలులో ఉన్న సమయంలో ఆయనకు అత్యవసరంగా అవసరమైన వైద్యాన్ని సకాలంలో అందించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విఫలమైనందున.. నా భర్త క్షేమం గురించి నేను చాలా ఆందోళన చెందుతున్నాను. ఆయన ఇప్పటికే 5 కిలోల బరువు తగ్గారు. ఇంకా బరువు తగ్గితే కిడ్నీలపై ప్రభావం చూపుతుంది. ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకులు అపరిశుభ్రంగా ఉండడంతో ఆరోగ్యానికి తీవ్ర ముప్పు వాటిల్లుతోంది. ఈ భయంకరమైన పరిస్థితులు నా భర్త జీవితానికి ముప్పును సృష్టిస్తాయని రాసుకొచ్చారు.
అయితే.. చంద్రబాబు బరువు తగ్గారంటూ వస్తున్న వార్తలపై జైళ్ల శాఖ డీఐజీ స్పందించారు. జైలుకు వచ్చాక చంద్రబాబు ఒక కేజీ బరువు పెరిగారని జైళ్ల శాఖ డీఐజీ తెలిపారు. చంద్రబాబు జైల్లోకి వచ్చినప్పుడు 66 కేజీలు బరువు వుండగా.. ప్రస్తుతం ఆయన 67 కేజీలకు చేరుకున్నారు. చంద్రబాబు ప్రస్తుతం చాలా ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు.