గత వారం పది రోజులుగా వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి(YS Jagan), వై.ఎస్.షర్మిలారెడ్డి(YS Sharmila) ఆస్తుల పంచాయితీపై జనం ఒక్కతీరుగా మాట్లాడుకుంటున్నారు.
గత వారం పది రోజులుగా వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి(YS Jagan), వై.ఎస్.షర్మిలారెడ్డి(YS Sharmila) ఆస్తుల పంచాయితీపై జనం ఒక్కతీరుగా మాట్లాడుకుంటున్నారు. ఇరు వర్గాలకు చెందిన వారు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. ఒకరిపై ఒకరు లేఖలు రాసుకుంటున్నారు. ఈ క్రమంలో తల్లి విజయమ్మ(Vijayamma) కూడా ఓ బహిరంగ లేఖ(Letter) విడుదల చేశారు. ఆస్తుల కోసం బిడ్డలు గొడవపడుతుంటే ఏ తల్లి అయినా బాధపడుతుంది. కొట్లాట ఆపేయమని వేడుకుంటుంది. సమస్య తొందరగా పరిష్కారం కావాలని కోరుకుంటుంది. విజయమ్మ కూడా అలాగే చేశారు. వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి కుటుంబ అభిమానులను ఉద్దేశిస్తూ ఓ పెద్ద లేఖ రాశారు. తగాదాను అన్నా చెల్లెళ్లు ఇద్దరే పరిష్కరించుకోగలరని తీర్మానించేశారు. ఇందులో బయటివారి జోక్యం అవసరం లేదని, వేరే ఎవ్వరూ దీని గురించి మాట్లాడవద్దని విజయమ్మ కోరారు. ప్రస్తుతం విజయమ్మ వై.ఎస్.షర్మిల ప్రాపకంలో ఉన్నారు కాబట్టి లేఖ ఆసాంతం ఆమెకు అనుకూలంగానే ఉన్నట్టు కనిపించింది. ఒక బిడ్డ ఇంకో బిడ్డకు అన్యాయం చేస్తుంటే చూసి తట్టుకోవడం చాలా కష్టం. తల్లిగా అన్యాయం జరిగిన బిడ్డ పక్షాన ఉండి మాట్లాడడం నా విధి, నా ధర్మం అని విజయమ్మ రాసుకొచ్చారు. అంటే జగన్ అన్యాయం చేస్తున్నట్టా? షర్మిల అన్యాయానికి గురవుతున్నట్టా? లేఖ మొత్తం షర్మిలకు అనుకూలంగానే ఉంది. ఆ లేఖను నిజంగానే విజయమ్మ రాశారా? లేక ఎవరైనా రాసి విజయమ్మతో సంతకం చేయించారా? షర్మిల డిక్టేట్ చేస్తే విజయమ్మ రాశారా? లేదా తల్లిపై ఒత్తిడి తెచ్చి బలవంతంగా రాయించారా? ఇలా బోల్డన్నీ సందేహాలు కలుగుతున్నాయి. లేఖను ఒకటికి రెండుసార్లు చదివితే విజయమ్మ ఓ కీలకమైన విషయాన్ని మిస్ అయ్యినట్టుగా తోస్తుంది. రాజశేఖర్‌రెడ్డి(YS Rajashekar reddy) బతికి ఉన్నప్పుడు కొన్ని ఆస్తులను ఇద్దరి పేరు మీద పెడుతూ వచ్చారని, ఆస్తి ఎవరు పేరు మీద ఉన్నప్పటికీ అవన్నీ కుటుంబ ఆస్తులేనని విజయమ్మ లేఖలో చెప్పారు. ఇదే నిజమనుకుందాం . అలాంటప్పుడు 2019లో ఎంఓయూ రాసుకున్నప్పుడు జగన్ పేరు మీద ఉన్న అన్ని ఆస్తులలో షర్మిలకు ఎంతెంత వాటాలు దక్కుతాయన్నది అందులో పొందుపరిచారు. ఆ లెక్కన షర్మిల పేరు మీద వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పెట్టిన ఆస్తులలో కూడా జగన్‌కు కొంత భాగం దక్కాలి కదా! ఆ సంగతి విజయమ్మ ఎందుకు చెప్పలేదు? ఈ విషయం కూడా చెప్పి ఉంటే విజయమ్మ చెప్పేది నిజమనుకోవచ్చు.