తెలుగుదేశంపార్టీ(TDP) అధినేత నారా చంద్రబాబునాయుడు(Nara chandrababu) ఎక్కడికి వెళ్లారు? టీడీపీ అనుకూల మీడియా ఎందుకలా పచ్చి అబద్ధాలు రాస్తున్నది? చెప్పి లండన్‌కు(London) వెళ్లిన జగన్మోహన్‌రెడ్డిపైనేమో(YS Jagan) అర్థంపర్థం లేని పిచ్చి రాతలు రాసిన మీడియా చెప్పాపెట్టకుండా రహస్యంగా.. ఎక్కడికి వెళుతున్నారో కూడా జనాలకు తెలియకుండా వెళ్లిన చంద్రబాబునాయడు మీదనేమో సైలెంట్‌! మామూలుగా అయితే చంద్రబాబు చెటాక్‌ పని చేస్తే క్వింటాలు పబ్లిసిటీని ఇస్తుంటాయి పచ్చ మీడియా.

తెలుగుదేశంపార్టీ(TDP) అధినేత నారా చంద్రబాబునాయుడు(Nara chandrababu) ఎక్కడికి వెళ్లారు? టీడీపీ అనుకూల మీడియా ఎందుకలా పచ్చి అబద్ధాలు రాస్తున్నది? చెప్పి లండన్‌కు(London) వెళ్లిన జగన్మోహన్‌రెడ్డిపైనేమో(YS Jagan) అర్థంపర్థం లేని పిచ్చి రాతలు రాసిన మీడియా చెప్పాపెట్టకుండా రహస్యంగా.. ఎక్కడికి వెళుతున్నారో కూడా జనాలకు తెలియకుండా వెళ్లిన చంద్రబాబునాయడు మీదనేమో సైలెంట్‌! మామూలుగా అయితే చంద్రబాబు చెటాక్‌ పని చేస్తే క్వింటాలు పబ్లిసిటీని ఇస్తుంటాయి పచ్చ మీడియా. చంద్రబాబు కూడా ఇదే కోరుకుంటారు. చంద్రబాబు మనసెరిగి ప్రవర్తించడమే కదా అనుకూల మీడియా చేసేది.. ఇప్పుడు చంద్రబాబు గప్‌చుప్‌గా విదేశాలకు ఉడాయించారు. తన భార్య భువనేశ్వరితో కలిసి శంషాబాద్‌ విమానాశ్రయంలో ఫ్లయిట్ ఎక్కిన చంద్రబాబు దుబాయ్‌కు వెళ్లారు.

అక్కడ్నుంచి ఎక్కడికి వెళ్లారో ఎవరికీ తెలియదు. మొదట వైద్యపరీక్షల కోసం అమెరికా(america) వెళ్లినట్టు తెలుగుదేశంపార్టీ చెప్పుకుంది. ఆ మీడియా కూడా అలాగే రాసింది. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, మొన్నామధ్య ఏపీకి వచ్చి ఓటర్లను ఎలా కొనుక్కోవాలో లెక్చర్లు ఇచ్చిన టీడీపీ ఎన్నారై విభాగం నేత కోమటి జయరాం మాత్రం చంద్రబాబు అమెరికాకు రాలేదని చెప్పారు. అమెరికాకు వెళ్లకుండా చంద్రబాబు ఎక్కడికి వెళ్లినట్టు? ఆయన ప్రయాణాన్ని ఇంత రహస్యంగా ఎందుకు ఉంచుతున్నారు? విదేశాల నుంచి అక్రమనిధులను(Black money) ఇండియాలోని షెల్ కంపెనీలకు(shell companies) మళ్లించడానికి వెళ్లలేదు కదా అన్న అనుమానాలు వస్తున్నాయి చాలా మందికి! ఎందుకంటే ఇంతకు ముందు అలా మళ్లించారనే ఆరోపణలు చంద్రబాబుపై ఉన్నాయి కాబట్టి.

ఎన్నికలు ముగిసినప్పట్నుంచి అటు చంద్రబాబు, ఇటు లోకేశ్‌(Nara Lokesh) సైలెంట్‌గా ఉంటున్నారు. ఎవరూ ఏ రకమైన స్టేట్‌మెంట్లు ఇవ్వడం లేదు. పవన్‌ కల్యాణ్‌(Pawan kalyan) కూడా డిటో డిటో! ఆయన ఎక్కడ ఉన్నారో జనసేన క్యాడర్‌ కూడా చెప్పలేకపోతున్నది. దగ్గుబాటు పురంధేశ్వరి(Purandeswari) కూడా మాట్లాడటం లేదు. ఇక్కడ ఉంటే ఏదో ఒకటి మాట్లాడవలసి వస్తుందన్న భయంతోనే చంద్రబాబు విదేశాలకు వెళ్లారన్నది ఓ టాక్‌! సాధారణంగా చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళుతున్నారంటే ఆయన ఇంటి నుంచి బయలుదేరినప్పట్నుంచి గమ్యం చేరే వరకు అనుకూల మీడియా దాదాపుగా లైవ్‌ కవరేజ్‌ ఉంటుంది. ఏం తిన్నారు? ఎప్పుడు పడుకున్నారు? ఎవరిని కలిశారు?వంటి వాటిపై వండి వార్చే కథనాలకు లెక్కే ఉండదు. ఈసారి మాత్రం గుట్టుచప్పుడు కాకుండా చంద్రబాబు విదేశాలకు వెళ్లారు.

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో ఇమ్మిగ్రేషన్‌ అధికారులు చంద్రబాబుకు కాసేపు అడ్డుకోవడంతో ఆయన విదేశాలకు వెళుతున్నారనే సంగతి తెలిసింది. చంద్రబాబుపై సీఐడీ లుక్‌ అవుట్ నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే కదా! సీఐడీ ముందస్తు అనుమతి తీసుకోకుండా చంద్రబాబు విదేశాలకు ఎలా వెళతారు? చంద్రబాబును అడ్డుకున్న ఇమ్మిగ్రే­షన్‌ అధికారులు సీఐడీని సంప్రదించారు. సీఐడీకి సమాచారం ఇవ్వకుండా దేశం విడిచి వెళ్లకూడదు కాబట్టి చంద్రబాబు తన విదేశీ పర్యటనపై అప్పటి­కప్పుడు సమాచారం ఇచ్చారు. సిఐడీ ఓకే అన్న తర్వాతే ఇమ్మిగ్రేషన్‌ అధికారులు ఆయన్ను వెళ్లనిచ్చారు. దుబాయ్‌కు వెళ్లిన చంద్రబాబు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లారో చెప్పలేదు. తన పర్యటనను అంత రహస్యంగా ఎందుకు ఉంచారో అంతుపట్టడం లేదు. ప్రస్తుతం ఆయన ఇటలీలో ఉన్నట్టు సమాచరం. దుబాయ్‌ నుంచి చంద్రబాబు, భువనేశ్వరి ఇటలీ వెళ్లినట్లు ఇమ్మిగ్రేషన్‌ వర్గాలు అనధికారికంగా చెప్పాయి. లోకేశ్‌, బ్రాహ్మణి కూడా అక్కడికే వెళ్లారట! పర్యటనపై చంద్రబాబు ఫ్యామిలీ ఎందుకు దాస్తున్నదో తెలియడం లేదు!

Updated On 21 May 2024 2:58 AM GMT
Ehatv

Ehatv

Next Story