ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ హైకోర్టు(AP High Court) ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్‌(Dheeraj Singh Thakur) ప్రమాణస్వీకారం చేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్‌ నజీర్‌.. జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్‌తో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య‌మంత్రి జగన్‌(CM), ప్రతిపక్ష నేత చంద్రబాబు(Chandrababu), పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ హైకోర్టు(AP High Court) ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్‌(Dheeraj Singh Thakur) ప్రమాణస్వీకారం చేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్‌ నజీర్‌.. జస్టిస్‌(Abdul naseer) ధీరజ్‌సింగ్‌ ఠాకుర్‌తో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య‌మంత్రి జగన్‌(CM), ప్రతిపక్ష నేత చంద్రబాబు(Chandrababu), పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ధీరజ్ సింగ్ 25 ఏప్రిల్ 1964లో జ‌న్మించారు. ఆయ‌న‌ 18 అక్టోబర్ 1989న బార్ కౌన్సిల్ ఆఫ్ ఢిల్లీ, బార్ కౌన్సిల్ ఆఫ్ జమ్మూ, కాశ్మీర్‌లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. 2011లో సీనియర్ న్యాయవాది హోదా పొందారు. 8 మార్చి 2013న జమ్మూ & కాశ్మీర్, లడఖ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియ‌మింప‌బ‌డ్డారు. ఆ త‌ర్వాత‌ 10 జూన్ 2022న బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. జూలై 5, 2023న సుప్రీంకోర్టు కొలీజియం ఆయనను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సిఫార్సు చేసింది. 24 జూలై, 2023న భారత రాష్ట్రపతి అతని నియామకాన్ని ఆమోదించారు. దీంతో ఆయ‌న ఈ రోజు ప్రమాణస్వీకారం చేశారు.

Updated On 28 July 2023 1:09 AM GMT
Ehatv

Ehatv

Next Story