మంత్రి ధర్మాన ప్రసాదరావు(Dharmana Prasada Rao) సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. రాజకీయాల నుంచి తప్పుకోవాల‌నుకుంటున్న‌ట్లు వ్యాఖ్యానించి మంత్రి ధర్మాన సంచ‌ల‌నానికి తెర‌లేపారు. మంత్రి ధ‌ర్మాన మాట్లాడుతూ.. చిన్న వయసులో రాజకీయాల్లోకి వచ్చి సేవ చేశానని.. ఇక విశ్రాంతి తీసుకుంటానని చెప్పారు.

మంత్రి ధర్మాన ప్రసాదరావు(Dharmana Prasada Rao) సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. రాజకీయాల నుంచి తప్పుకోవాల‌నుకుంటున్న‌ట్లు వ్యాఖ్యానించి మంత్రి ధర్మాన సంచ‌ల‌నానికి తెర‌లేపారు. మంత్రి ధ‌ర్మాన మాట్లాడుతూ.. చిన్న వయసులో రాజకీయాల్లోకి వచ్చి సేవ చేశానని.. ఇక విశ్రాంతి తీసుకుంటానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయననే విష‌యం సీఎం జగన్ కు(CM Jagan) చెప్పానని తెలిపారు. అయితే, జగన్ మాత్రం ఈ ఒక్కసారికి పోటీ చేయాలని చెప్పారని వివ‌రించారు. ఇప్పటివరకు తాను 12 సార్లు పోటీచేసి ఆరుసార్లు విజయం సాధించానని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ప్ర‌జ‌లు ఆశీర్వదిస్తే గెలిచి సేవకుడిగా ఉంటానని.. ఓడిపోతే స్నేహితుడిగా ఉంటానని పేర్కొన్నారు. తనకు ఈ గౌరవం దక్కడానికి ప్ర‌జ‌లే కారణమని.. కాబట్టే ఈ విషయాలన్నీ వారికే చెబుతున్నానని ధర్మాన తెలిపారు.

ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం(Srikakulam) జిల్లా నరసన్నపేట మండలానికి చెందిన మబగాం గ్రామంలో సావిత్రమ్మ, రామలింగంనాయుడు దంపతులకు 1957 మే 21 న జన్మించారు. ఆయ‌న కాంగ్రెస్ సభ్యునిగా 1989, 1999, 2004, 2009 అసెంబ్లీ ఎన్నికలలో నరసన్నపేట అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యారు. ఆయ‌న‌ నేదురుమల్లి జనార్ధనరెడ్డి , కోట్ల విజయభాస్కరరెడ్డి మంత్రివర్గాలలో చేనేత,జౌళిశాఖ, క్రీడలు, చిన్నతరహా నీటిపారుదలం మైనరు ఫోర్టుల శాఖలకు మంత్రిగా తన సేవలనందించారు. వై.యస్. రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలోనూ రెవెన్యూ మంత్రిగా పనిచేసారు. 2013లో వైసీపీలో చేరారు. 2019లో వైఎస్సార్‌సీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి 2022 ఏప్రిల్ 11న వైఎస్‌ జగన్ మంత్రివర్గంలో రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంప్స్‌ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.

Updated On 30 Sep 2023 5:57 AM GMT
Ehatv

Ehatv

Next Story